

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఫిబ్రవరి 02 :
మాజీ మంత్రి అంబటి రాంబాబు,వైసిపి నేతల ఇళ్లపై దాడులు చేసిన టీడీపీ గుండాలపై కేసులు నమోదు చేసి కఠినచర్యలు తీసుకోవాలని మున్సిపల్ చైర్మెన్ మాబున్నిసా,ఎమ్మెల్సీ ఇషాక్ భాష డిమాండ్ చేశారు.తిరుమల లడ్డూ పై దుష్ప్రచారం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లతే తప్పు అని సీబీఐ, సిట్ సాక్షిగా బహిర్గతం కావడం కావడంతో రాష్ట్ర ప్రజలకు అసత్యం చెప్పామన్న విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి మాజీ మంత్రి అంబటి రాంబాబును రెచ్చగొట్టి కర్రలతో, రాళ్లతో, గుడ్డతో ఇంటిపై దాడులు చేసి అలాగే వైసీపీ నేతల ఇళ్లను తగులబెట్టి వారి కార్లను కాల్చివేసి భీతావహ వాతావరణాన్ని తెలుగుదేశం కార్యకర్తలు సృష్టించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, దాడులను ఖండిస్తున్నామని నంద్యాల ఎమ్మెల్సీ ఇసాక్ బాష, మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నీసా, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి డా. శశికళారెడ్డి, వైసీపీ ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, జిల్లా మేధావుల విభాగం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, వైసీపీ మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు టీ వై శివయ్య, వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి అనీల్ అమృతరాజ్, జిల్లా క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు కారురవికుమార్, వైసీపీ జిల్లా కార్యదర్శులు దేవనగర్ బాష, శివనాగిరెడ్డి, నంద్యాల నియోజకవర్గ అధ్యక్షుడు రామచంద్రుడు, నంద్యాల అసెంబ్లీ క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు మనోజ్ కుమార్, కౌన్సిలర్లు సాదిక్ బాష, కలాం బాష, ఆరిఫ్ నాయక్, నంద్యాల వైసీపీ విభాగం సభ్యురాలు హుసేనమ్మ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పేర్కొన్నారు. ఈ మేరకు వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి నిర్దేశం మేరకు నంద్యాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడిచేసిన తెలుగు దేశం గుండాలపై అలాగే భూమన కరుణాకర్ రెడ్డి ఇంటిపై జోగిరమేష్ ఇంటిపై దాడిచేసి తగులబెట్టిన భీతావహానికి కారకులైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఫిర్యాధు చేయడం జరిగింది. అనంతరం వైసీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ…
రాష్ట్రంలో తెలుగు దేశం గూండాల విద్యంస కాండ కొనసాగుతున్నదని, ఇటీవల గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు, వైసీపీ నేతల ఇళ్ల పై తెలుగుదేశం గూండాలు కర్రలు, రాళ్లతో దాడులు చేసి ధ్వసం చేసిన ఘనటలో పాల్గొన్న ప్రతి ఒక్కరిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరుమల లడ్డుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన దుష్ప్రచారంపై సీబీఐ, సిట్ ధర్యాప్తు సంస్థలు శ్రీవారి లడ్డూలో ఎటువంటి జంతువుల కొవ్వులు కలపలేదని క్లీన్ చీట్ ఇవ్వడంతో ఎక్కడ తాము చేసిన తప్పిదం ప్రజల్లోకి వెళ్లి పోతుందోనని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ దాడులు చేయడం దారుణమైన చర్యలని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కూటమి నేతలు రాష్ట్ర ప్రజలకు లడ్డూ వివాధంలో తాము తప్పు చేశామని క్షమాపణ కోరాల్సి ఉండగా మాజీ మంత్రి అంటి రాంబాబును తెలుగుదేశం వారు నోటికి వచ్చిన విధంగా దుర్భాషలాడటం సభ్యసమాజం తలదించుకునేలా ఉందన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు భీతావహాన్ని సృష్టిస్తూ దాడులకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అసత్యపు ప్రచారంలో భాగంగా గుంటూరులో ప్లెక్సీలు వేసిన తెలుగుదేశం వారు ఆ ప్లెక్సీలను తీయాలని కోరిన మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కర్రలతో, రాళ్లతో దాడికి పాల్పడేందుకు సిద్ధంగా ఉండి అక్కడ నుండి ఇంటిపై దాడికి పాల్పడ్డారని ఇది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో చేస్తున్న దుష్టపాలన అని విమర్శించారు. దాడులకు పాల్పడిన తెలుగుదేశం గూండాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
