
సత్యం వార్త / నంద్యాల / ఫిబ్రవరి 02 :
నంద్యాల టౌన్ 38వ వార్డు వై.యస్.ఆర్ నగర్ బుడగజంగం కాలనీ నందు మరియు ఎస్పి వై రెడ్డి స్మార్ట్ సిటీ కాలనీ నందు శాంతి భద్రతల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మంత్రి వర్యులు ఎన్ఎండి. ఫరూక్ ఆదేశాల మేరకు వారి కుమారులు ఎన్ఎండి. ఫిరోజ్, ఎన్ఎండి. ఫయాజ్ ఆదేశాల మేరకు తాలూకా సిఐ ఈశ్వరయ్య పర్యవేక్షణలో వార్డు తెలుగుదేశం పార్టీ ఇంచార్జి తాటికొండ బుగ్గరాముడు తన సొంత నిధులతో దాదాపుగా నాలుగు సిసి కెమెరాలు ఏర్పాటు చేపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్మార్ట్ సిటీ కాలనీ వాసులు మధుసుధన్ రెడ్డి, నారాయణ రెడ్డి, లింగమయ్య తదితరలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
