మహానందీశ్వరుడిని దర్శించుకున్న టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఫిబ్రవరి 17 :

ప్రముఖ శైవ క్షేత్రమైన మహానంది పుణ్యక్షేత్రాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ మంగళవారం సందర్శించారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఫయాజ్ ముందుగా క్షేత్ర పాలకుడైన మహానందీశ్వరుడిని, కామేశ్వరీ దేవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని పవిత్ర కోనేరులను పరిశీలించారు. ఈ సందర్భంగా పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించి, స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ మహానంది అత్యంత శక్తివంతమైన పుణ్యక్షేత్రంమని, ఇక్కడికి రావడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని ఆ మహానందీశ్వరుడిని ప్రార్థించానని. ముఖ్యంగా యువత ఆధ్యాత్మిక చింతనతో పాటు క్రమశిక్షణతో సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కండే శ్యామ్ సుందర్ లాల్, నేరెళ్ల అశోక్, బింగుమళ్ల శ్యాంసుందర్ గుప్తా, వినయ్, గంగిశెట్టి రాజేష్, గంగిశెట్టి మల్లికార్జున, సురేష్, చలం బాబు, వరప్రసాద్, బుగ్గ రాముడు, దీపక్ రెడ్డి , ప్రసాద్ రెడ్డి, మిద్దె ఉసేని , ఉప్పరి సురేష్ కుమార్, నాగరాజు, జయ కృష్ణ , జైలాన్, మహేష్ మరియు  స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Scroll to Top