మహానందిలో ఘనంగా ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన

ముఖ్య అతిథిగా పాల్గొన్న టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఫిబ్రవరి 17 :

ఈ సందర్భంగా ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ మన తెలుగు రాష్ట్రాల గర్వకారణమైన ఒంగోలు జాతి పశువులను సంరక్షించుకోవాలనే ఉద్దేశంతో ఇటువంటి పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఎంతో వ్యయప్రయాసలకోర్చి ఎడ్లను పెంచి, ఈ పోటీలకు తీసుకువచ్చిన రైతు సోదరులను ఆయన అభినందించారు. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ బలప్రదర్శన నిర్వహించడం భక్తులకు, రైతులకు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో కేసి కెనాల్  చైర్మన్ బన్నూరు రామలింగారెడ్డి, కొట్టాల శివ నాగిరెడ్డి, ప్రేమ్ కుమార్ రెడ్డి, రాజేష్, కౌన్సిలర్ కండే శ్యామ్ సుందర్ లాల్, నేరెళ్ల అశోక్, బింగుమళ్ల శ్యాంసుందర్ గుప్తా, వినయ్, గంగిశెట్టి రాజేష్, గంగిశెట్టి మల్లికార్జున, సురేష్, చలం బాబు, నాగరాజు కుమార్, వరప్రసాద్, బుగ్గ రాముడు, దీపక్ రెడ్డి , ప్రసాద్ రెడ్డి, మిద్దె ఉసేని , ఉప్పరి సురేష్ కుమార్, నాగరాజు, జయ కృష్ణ , జైలాన్, మహేష్ మరియు స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, భారీ సంఖ్యలో రైతులు మరియు భక్తులు పాల్గొన్నారు.

Scroll to Top