




షాదీఖానా నిర్మాణానికి కృషి చేసినందుకు ఎన్‌ఎండి ఫిరోజ్, ఎన్‌ఎండి ఫయాజ్ కు ఘనంగా సన్మానించిన యాళ్ళురు గ్రామ మైనారిటీ సోదరులు
సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఫిబ్రవరి 10 :
నంద్యాల నియోజకవర్గం గోస్పాడు మండలం యాళ్లూరు గ్రామంలో ముస్లిం మైనారిటీ సోదరుల కోసం షాదీఖానా నిర్మాణ పనులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో యాళ్లూరు గ్రామంలోనీ మైనారిటీ సోదరుల ఆధ్వర్యంలో ఘనంగా టీడీపీ నాయకులకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎండి ఫిరోజ్ గారు మాట్లాడుతూ గత ఎన్నికల ప్రచార సమయంలో యాళ్లూరు గ్రామంలోని మైనారిటీ సోదరులు తమ గ్రామంలో షాదీఖానా నిర్మించాలని కోరారని, టీడీపీ అధికారంలోకి రాగానే తప్పకుండా షాదీఖానా నిర్మిస్తామని ఆ సమయంలో హామీ ఇచ్చామని తెలిపారు.ఇప్పుడు ఆ హామీని నిజం చేస్తూ మంత్రి ఎన్‌ఎండి ఫరూక్ కృషి ఫలితంగా షాదీ ఖాన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయడం ఆనందకరమని విషయమన్నారు.
గతంలో యాళ్లూరు గ్రామంలో మౌలిక వసతుల కల్పనతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, అలాగే గోస్పాడు మండలంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. గత పాలకులు గోస్పాడు మండల ప్రజల ఓట్లు దండుకున్నారే తప్ప వారి కోసం ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని విమర్శించారు. ఎన్‌ఎండి ఫరూక్ నాయకత్వంలో నంద్యాల నియోజకవర్గంలో మస్జీదులు, షాదీఖానాలు, ఈద్ఘాల మరమ్మతులకు నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు.అలాగే నంద్యాల పట్టణంలో ఉర్దూ జూనియర్ కాలేజీ నిర్మాణం, పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్, కుబ్రా షాదీఖానా పునర్నిర్మాణం వంటి అనేక పనులను ఇప్పటికే ప్రారంభించామని, త్వరలోనే వాటిని పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారు.నంద్యాల పట్టణంలో పద్మావతి నగర్‌లో రెండు వరుసల రోడ్డు నిర్మాణం పూర్తయ్యిందని, అలాగే సంజీవ నగర్ నుంచి ఆత్మకూరు బస్ స్టాండ్ వరకు రోడ్డు నిర్మాణం కొనసాగుతోందని తెలిపారు.నంద్యాల రూపురేఖలు మారేలా అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు ఎన్‌ఎండి ఫయాజ్, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మనియర్ ఖలీల్, గోస్పాడు టీడీపీ కన్వీనర్ తులసిశ్వార రెడ్డి, యాళ్లూరు టీడీపీ నాయకులు వెంకట రెడ్డి, మైనారిటీ నాయకులు బషీర్, రఫీ టీడీపీ నాయకులు అజ్మీర్, జైలన్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
