శ్రీశైలంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన కర్నూలు రేంజ్ డీఐజీ మరియు జిల్లా ఎస్పీ

భక్తులు సంయమనం పాటిస్తూ దర్శనం చేసుకోవాలని భక్తులకు విజ్ఞప్తి

ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు భక్తులు పోలీసు వారి సూచనలు తప్పనిసరిగా పాటించాలి

సత్యం వార్త / నంద్యాల క్రైమ్ / ఫిబ్రవరి 10 :

జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం నందు జరుగుచున్న మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని దర్శనం కొరకై దేశం నలుమూలల నుండి భక్తులు విచ్చేయుచున్న సందర్భంగా శ్రీశైల క్షేత్రం భక్తులతో రద్దీగా ఉండడం జరుగుతుంది.

ఈ సందర్భంగా భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని శ్రీశైల క్షేత్రం నందు బందోబస్తు ఏర్పాట్లను కర్నూల్ రేంజ్ డిఐజి శ్రీ కోయ ప్రవీణ్ ఐపిఎస్ తో పాటు నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఐపిఎస్ పరిశీలించడం జరిగింది. ఇందులో భాగంగా గుడి పరిసర ప్రాంతాలు, గుడి బయట ఏర్పాటుచేసిన క్యూలైన్లు మొదలుకొని స్వామి అమ్మవారి దర్శనం అనంతరం నిష్క్రమించే మార్గం వరకు ఏర్పాటు చేసిన క్యూలైన్లను మరియు శివ స్వాములు వేచి ఉండే చంద్రావతి కళ్యాణమండపం మరియు ప్రత్యేకంగా వారికి ఏర్పాటు చేసిన క్యూలైన్లు, పార్కింగ్ ప్రదేశాలలో స్వయంగా పర్యటించడంతోపాటు సి సి  కెమెరాల ద్వారా భక్తుల రద్దీని వారి భక్తుల భద్రత ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది.

అనంతరం భద్రత దృశ్య ప్రతి ఒక్కరిని తనిఖీ చేయాలని గుడి ప్రవేశ మరియు నిష్క్రమణ ప్రాంతాలలో డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లను (డిఎఫ్‌ఎండి) ఏర్పాటు చేసుకోవాలని, విధినిర్వహణలో ఉన్న సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని,ఏదైనా సమస్య ఉంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సిబ్బందికి అధికారులకు  పలు సూచనలు చేయడం జరిగింది.

శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి దర్శనం నిమిత్తం విచ్చేయు భక్తులు ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు పోలీసు వారి సూచనలు పాటిస్తూ తమ వాహనాలను ఇతరులకు ఆటంకం లేకుండా పార్కింగ్ ప్రదేశాలలో మాత్రమే పార్కింగ్ చేసుకోవాలని రోడ్డుకిరువైపులా వాహనాలను నిలుపు రాదని విజ్ఞప్తి చేయడం జరిగింది.

Scroll to Top