బీసీ భవన నిర్మాణం కొరకు స్థలం కేటాయింపుకు హామీ ఇచ్చిన నంద్యాల జిల్లా కలెక్టర్

సత్యం వార్త / నంద్యాల / జనవరి 13 :
జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ నాయకులు వై నాగేశ్వరరావు డీసీఎంస్ చైర్మన్ మరియు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, యాదవ్ రాంబాబు గౌరీదేవి ప్రసాద్ పృద్వి పిజి వెంకటేష్ బాలచంద్రుడు, గోవిందు నాయుడు ఉప్పర శివన్న, విష్ణు రాజేష్ మొదలైన నాయకులు ఈరోజు నంద్యాల జిల్లా కలెక్టర్ ని కలిసి బీసీల సమస్యపై, డిమాండ్స్ పై కలెక్టర్ తో చర్చించడం జరిగింది. బీసీల సమస్యలను పరిష్కరించుటకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని మరియు తన పరిధిలో లేని సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్తామని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతి జిల్లాకు బీసీ భవన నిర్మాణం చేపట్టుటకు దేశాలు జారీ చేయడం జరిగిందని త్వరలోనే బీసీ భవనం నిర్మాణము చేపడతామని హామీ ఇచ్చారు. డోన్ నియోజకవర్గం లోని వాల్మీకి గుహలను అభివృద్ధి చేయాలని, జిల్లా కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీలో ఉన్న సమస్యలను ఇబ్బందులను తెలియజేసి వాటి పరిష్కారానికి సహాయ సహకారాలు అందించాలని, అలాగే రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించి వారిని ఆర్థికంగా ఆదుకోవాలని డీసీఎంఎస్ చైర్మన్ వై. నాగేశ్వరరావు యాదవ్ ఈ సందర్భంగా తెలపడం జరిగింది దానికి కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించడం జరిగిందని తెలియజేశారు.

Scroll to Top