ప్రకృతి వ్యవసాయాన్ని గ్రామ స్థాయిలో ముందుకు తీసుకొనిపోవాలి

ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రోత్సహించాలి

ప్రకృతి వ్యవసాయాన్ని సంఘాల ద్వారా విస్తరించాలి

సత్యం వార్త / నంద్యాల / ఫిబ్రవరి 10 :

ప్రకృతి వ్యవసాయాన్ని గ్రామస్థాయిలో ముందుకు తీసుకొనిపోయి ,రైతులకు అవగాహన కల్పించి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించేందుకు ప్రోత్సహించాలని జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు.

సెర్ఫ్ , ఆర్ వై ఎస్ ఎస్ సమన్వయ శిక్షణ  సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆహారం–పోషణ–గృహోపాధి  అంశాలపై రెండు రోజుల జిల్లా స్థాయి సమన్వయ శిక్షణ కార్యక్రమం మొదటి రోజు విజయవంతంగా నిర్వహించబడింది.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్  శ్రీధర్ రెడ్డి  పాల్గొని మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో పోషణ భద్రత సాధించడంలో  సమన్వయం అత్యంత కీలకం అని పేర్కొన్నారు. ఫుడ్ బాస్కెట్, న్యూట్రి గార్డెన్స్, న్యూట్రి ఎంటర్‌ప్రైజెస్ వంటి కార్యక్రమాలను గ్రామ స్థాయిలో బాధ్యతతో, సమన్వయంతో అమలు చేయాలని, ప్రతి లబ్ధిదారుని సరైన విధంగా గుర్తించి నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. అలాగే ఫీల్డ్ స్థాయిలో ఎదురయ్యే సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.

ఏ డి పి ఎం సలాం మాట్లాడుతూ సంఘాల ద్వారా ప్రకృతి వ్యవసాయాన్ని గ్రామ స్థాయిలో ఎలా ముందుకు తీసుకెళ్లాలి, రైతులకు అవగాహన కల్పించి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని  వివరించారు.

మొదటి రోజు శిక్షణలో ఆరోగ్యం–పోషణ కార్యకలాపాల అవగాహన, ఫుడ్ బాస్కెట్ అమలు విధానం, కమ్యూనిటీ పాత్రలు, బాధ్యతలు, గ్రామ స్థాయి ప్రణాళిక, అలాగే ప్రకృతి వ్యవసాయాన్ని సంఘాల ద్వారా విస్తరించే విధానాలపై ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఫీల్డ్‌లో ఎదురయ్యే సవాళ్లు, వాటి పరిష్కార మార్గాలపై పాల్గొన్నవారితో పరస్పర చర్చలు నిర్వహించారు.

ఈ శిక్షణ కార్యక్రమంలో డిపిఎం పుణ్యవతి, అడిషనల్ డిపిఎం సలాం, నాలుగు మండలాల ఏపీఎంలు, సి.సి లు,వి ఓ యెస్ ,వి ఓ–ఓ బి లు, హెల్త్ సబ్ కమిటీ సభ్యులు, డిస్ట్రిక్ట్ యాంకర్ ,మార్కెటింగ్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top