పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పట్టణ అధ్యక్షులు మనియార్ ఖలీల్ అహ్మద్

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఏప్రిల్ 01  :

నంద్యాల పట్టణంలోని 40వ వార్డు చిన్న ఆసుపత్రి ప్రాంతంలో నిర్వహించిన పెన్షన్‌ల పంపిణీ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నంద్యాల పట్టణ అధ్యక్షులు మరియు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మనియార్ ఖలీల్ అహ్మద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులతో కలిసి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి, వారిని ప్రత్యక్షంగా కలిసి ఆత్మీయంగా పలకరించి పెన్షన్‌లను అందజేశారు.

ఈ కార్యక్రమంలో మనియార్ ఖలీల్ అహ్మద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు అందించే పెన్షన్‌ల పెంపుపై ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోందన్నారు. ప్రస్తుతం రాష్ట్రం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, కూటమి ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్‌లు లబ్ధిదారులకు భరోసాను కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్‌చార్జ్ గోవింద నాయుడు, టీడీపీ వార్డు నాయకులు అబ్బాస్,మాలి బాషా, ముఖద్దర్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top