నంద్యాల విద్యార్థిని తులసికి జాతీయ సబ్ జూనియర్ హాకీ జట్టులో స్థానం


సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఏప్రిల్ 01  :

నంద్యాల జిల్లా నంద్యాల పట్టణానికి చెందిన ఎస్.పి.జి జూనియర్ కళాశాల విద్యార్థిని తులసి జాతీయ స్థాయి అండర్-17 సబ్ జూనియర్ హాకీ జట్టుకు ఎంపికైంది. ప్రస్తుతం సిఇసి ద్వితీయ సంవత్సరం చదువుతున్న తులసి ప్రతిభను గుర్తించిన హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు చాణక్య రాజు ఈ విషయాన్ని వెల్లడించారు.  ఈనెల 1వ తేదీ నుండి 12వ తేదీ వరకు జార్ఖండ్ రాష్ట్రంలో నిర్వహించబడనున్న జాతీయ అండర్-17 సబ్ జూనియర్ హాకీ చాంపియన్షిప్ పోటీలలో తులసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించనుంది.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ దివాకర్ తులసిని అభినందిస్తూ, ఆమె భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అలాగే తులసికి శిక్షణ ఇచ్చిన కోచ్ శ్రావణ్ కుమార్ కృషిని ప్రశంసించారు. క్రీడా రంగంలో తులసి సాధించిన ఈ విజయంతో కళాశాల మరియు జిల్లాకు గౌరవం తీసుకువచ్చిందని తెలిపారు.

Scroll to Top