పీపుల్స్ హెల్త్ సొసైటీ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఫిబ్రవరి 17 :

నంద్యాల పట్టణంలోని మున్సిపల్ టౌన్ హాల్ లో పీపుల్స్ ఫర్ సొసైటీ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సొసైటీ నాయకులు లక్ష్మణ్ అధ్యక్షత వహించగా నాయకులు టి రమేష్ కుమార్, మద్దులు, రామచంద్రుడు,  నరసింహ,పి వెంకట లింగం, బాల వెంకట్,మౌలాలి, నిర్మల లతో పాటు మరి కొంతమంది కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చిన్న పిల్లల నుండి పెద ప్రజలందరికీ అన్ని రకాల రోగాలకు ఉచితంగా మందులు పంపిణీ చేయించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ సమాజంలో ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమవుతున్నాయి ప్రజల స్థితి కూడా కార్పొరేట్ హాస్పటల్ లకు వెళ్లే పరిస్థితులలో లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వము ప్రజలందరికీ మెరుగైన వైద్యాన్ని అందించేందుకు కృషి చేయాలని పేద ప్రజలను ఆదుకోవాలని వైద్యమందకుండా చనిపోయిన వారందరూ ఉన్నారని అలాంటి ఘటనలు పునరావడం కాకుండా ప్రభుత్వము వైద్యం పైన ప్రత్యేక కృషి చేయాలని ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది తెలుగు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Scroll to Top