పవిత్ర రంజాన్ వేళ మంత్రి ఫరూక్ ఆధ్వర్యంలో బలిజ–ఆర్యవైశ్య సోదరులకు ఆత్మీయ విందు

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 19 :

నంద్యాల పట్టణంలోని ప్రముఖ ఫంక్షన్ హాల్ నందు బలిజ మరియు ఆర్యవైశ్య పట్టణ ప్రముఖుల కొరకు రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ఆధ్వర్యంలో ఆత్మీయ విందు కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ ఆత్మీయ విందుకు బలిజ మరియు ఆర్యవైశ్య డాక్టర్లు, న్యాయవాదులు, వ్యాపారవేత్తలు, విద్యాసంస్థల అధినేతలు, విలేకరులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ సందర్బంగా రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మరియు తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ అతిథులను ఆత్మీయంగా పలకరిస్తూ, వారి యోగక్షేమాలు  అడిగి తెలుసుకొని, స్నేహపూర్వక వాతావరణంలో ఆత్మీయంగా వారితో కలిసి విందులో పాల్గొన్నారు.

ఈ ఆత్మీయ విందు సందర్భంగా నంద్యాల అభివృద్ధిపై హాజరైన ప్రముఖులు ఎన్ఎండి ఫరూక్ కి విలువైన సలహాలు, సూచనలు తెలియజేయగా వాటిని ఆయన శ్రద్ధగా ఆలకించి సానుకూలంగా స్పందించడం జరిగింది.

Scroll to Top