



సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 19 :
రంజాన్ పండుగను పురస్కరించుకుని నంద్యాల భీమవరం రోడ్డులోని అల్పూర్ ఖాన్ ఈద్గా వద్ద శనివారం నిర్వహించనున్న సామూహిక ప్రార్థనల ఏర్పాట్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ సంక్షేమ మరియు న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పర్యవేక్షించారు. ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొనే ఈ ప్రార్థనల కోసం ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను మరియు నిర్వాహకులను ఆయన ఆదేశించారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తాగునీరు, షామియానాలు మరియు మరుగుదొడ్ల సౌకర్యం పక్కాగా ఉండాలని సూచించారు. ఈద్గా పరిసర ప్రాంతాల్లో పారిశుధ్య పనులను వేగవంతం చేయాలని తెలిపారు. భీమవరం రోడ్డులో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ రంజాన్ పండుగ అనేది క్రమశిక్షణకు, దాతృత్వానికి ప్రతీక అని . ఈ పవిత్ర పర్వదినాన అల్పూర్ ఖాన్ ఈద్గా వద్ద ప్రార్థనలకు వచ్చే ప్రతి ఒక్కరికీ మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు . అందరూ ఈ పండుగను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు
ఈ కార్యక్రమంలో నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మునియార్ ఖలీల్, నీటి సంఘాల చైర్మన్ చాబోలు ఇలియాస్, జైలాన్,మున్నా , అక్బర్, మిద్దె ఉసేని, సుబ్బి, ప్రదీప్ రెడ్డి స్థానిక మైనార్టీ నాయకులు మరియు ఈద్గా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
