నంద్యాల లో గోల్డెన్ కేఫ్ హలీం హైదరాబాద్ తరహాలో రుచి

  • నాణ్యతతో చికెన్,మటన్ హలీం
  • స్వచ్ఛమైన నెయ్యి,కల్తీలేని హలీం మీ కోసం
  • ముగ్గురు పాత్రికేయుల వ్యాపారానికి అందరూ సహకరించండి

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఫిబ్రవరి 20 :

పవిత్ర రంజాన్ మాసం వచ్చిందంటే అని వర్గాలు ఎదురుచూసేది హలీం కోసం. హైదరాబాద్,చెన్నై,బెంగళూరు తదితర పట్టణాలకే గతంలో హలీం పరిమితం అయ్యదే. రంజాన్ మాసం వచ్చిందంటే హలీం ప్రియులు ఒకసారైనా రుచి చూడాలని హైదరాబాద్ కు వెళ్ళి హలీం ను ఆస్వాదించేవారు. హిం కు గిరాకీ ఉండడంతో గత కొన్నేళ్లుగా నంద్యాల వాసులకు హలీం తినే అవకాశం లభిస్తుంది. రంజాన్ మాసంలో మైనార్టీ సోదరులు 30 రోజులు ఉపవాసదీక్షలు చేస్తారు.వేకువ జామున 5 గంటల నుంచి సాయంత్రం వరకు ఉపవాసదీక్షలో పాల్గొంటారు.సాయంత్రం వరకు చుక్క నీరు తాగకుండా దీక్షలు చేపడతారు.దీక్షలు అయిపోయిన తర్వాత మైనార్టీ సోదరులు వారికి నచ్చిన ఆహారం తీసుకుంటారు.ప్రధానంగా హలీం ప్రియులు అధికంగా ఉండడంతో నంద్యాల వాసులకు హలీం ను పరిచయం చేశారు.ఈ నేపధ్యంలో నంద్యాలలో హలీం కు గిరాకీ పెరిగింది.రుచి,నాణ్యత,కల్తీ లేని హలీం సెంటర్లకు బాగా గిరాకీ ఉంది.ఈ నేపధ్యంలో నంద్యాల పట్టణానికి చెందిన ముగ్గురు పాత్రికేయులు కొన్నేళ్లుగా పాత్రికేయ వృత్తిలో సేవ చేసి వ్యాపారంలో స్థిరపడాలని  కోల్డ్ కేఫ్ హోటల్ వ్యాపారం ప్రారంభించి మంచి టీ,కాఫీ అందిస్తుండడంతో కొద్దిరోజుల్లోనే పేరు సంపాదించుకున్నారు.ముగ్గురు ఆలోచనలు తో రంజాన్ మాసం ప్రారంభం కావడంతో హైదరాబాద్ నుంచి మాస్టర్ ను తీసుకొచ్చి రుచి,నాణ్యత,కల్తీ లేని చికెన్,మటన్ హలీం ను నంద్యాల ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చారు.గోల్డెన్ కేఫ్ లో తక్కువ ధరలకు చికెన్ 120 ,మటన్ 180 రూపాయలకు ఎంతో రుచికరమైన హలీం అందించడంతో హలీం అభిమానులు టెస్ట్ కు మెచ్చుకుంటూ పలువురికి చెప్పడం విశేషం.ప్రధానంగా మున్సిపల్ కార్యాలయం సమీపంలోని సూరజ్ గ్రాండ్ వద్ద ఉన్న గోల్డెన్ కాఫీ కుటుంబసభ్యులు సైతం కూర్చొని తినడానికి ప్రత్యేక వసతి కల్పించారు.గతంలో హలీం వేడి,వేడిగా తినాలి అనుకున్నవారికి,కుటుంబసభ్యులకు అవకాశం ఉండేది కాదు.గోల్డెన్ కేఫ్ లో మాత్రం కుటుంబసభ్యులు కూర్చొని హలీం ఆస్వాదించడానికి ప్రత్యేక సదుపాయం కల్పించడంతో మైనార్టీ సోదరులు కుటుంబసభ్యులతో కలిసి హలీం ను తిన్న వారు అచ్చం హైదరాబాద్ తరహాలో టెస్ట్ ఉందని,ఇలాగే మెయింటైన్ చేయండని చెప్పడం విశేషం.హలీం ను కూర్చొని తినేందుకు వసతి కల్పించిన ముగ్గురు పాత్రికేయ మిత్రులకు వ్యాపారపరంగా అభివృద్ధి జరగాలని ఆశిద్దాం.

Scroll to Top