*సరైన ధ్రువపత్రాలు లేని మోటార్ సైకిళ్ళు స్వాధీనం


సత్యం వార్త / నంద్యాల జిల్లా క్రైమ్ / మార్చి 01:
నంద్యాల జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నివారణే లక్ష్యంగా నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఐపీఎస్ ఆదేశాలమేరకు నంద్యాల సబ్ డివిజన్ ఎ.ఎస్పీ ఐపీఎస్ సూచనలతో నేటి తెల్లవారుజామున రెండవ పట్టణ ఇన్స్పెక్టర్ అస్రార్ భాష, స్థానిక పోలీసు సిబ్బంది బృందాలుగా ఏర్పడి రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని విశ్వనగర్ మరియు ఫకీర్ పేట నందు కార్డెన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా విశ్వనగర్ నందు నేర చరిత్ర గలవారు మరియు అనుమానితులు, రౌడీ షీటర్ల ఇళ్లలో సోదాలు నిర్వహించడం జరిగింది. ఇందులో సరైన ధ్రువపత్రాలు లేని మోటార్ సైకిల్ లను స్వాధీనం చేసుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ ఏవరైనా చట్టవ్యతిరేక కార్యకలపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, పోలీసు అధికారులు హెచ్చరించారు. కార్డన్ సెర్చ్ ఆపరేషన్ లు నిరంతరం కొనసాగుతుంటాయని పేర్కోన్నారు
