కొత్తూరు సుబ్బారాయునికి ఒక కేజీ వెండి నాగ పడిగె విరాళము -ఆలయ ఈవో యం.రామక్రిష్ణ

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 01:
ప్రముఖ శైవక్షేత్రం పాణ్యం మండలం ఎస్.కొత్తూరు గ్రామంలో వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఒక కేజీ యాభై గ్రాముల వెండి నాగపడిగె మరియు అన్నదానమునకు నిత్యవసర సరుకులు భక్తులు ఆదివారం విరాళంగా సమర్పించినట్లు ఆలయ ఈవో యం.రామకృష్ణ తెలిపారు. బనగానపల్లె మండలం పలుకూరు గ్రామానికి చెందిన ఉప్పరి సుబ్బరాయుడు (రాజు) వారి కుటుంబ సభ్యులకు స్వామివారి ఇంటి ఇలవేల్పు కావడంతో మొక్కుబడిగా 3లక్షల 50 వేలు విలువగల ఒక కేజీ యాభై గ్రాముల వెండి నాగపడిగెను మరియు అన్నదానమునకు సుమారు 70 వేలు విలువగల నిత్యవసర సరుకులు వితరణ జేసి అన్నదానమును నిర్వహించారు. వారికి ఆలయ మర్యాదలతో స్వామివారికి అభిషేకములు, అర్చనలు, విశేష పూజలు నిర్వహించి శాలువాలు పూలమాలతో ఘనంగా సత్కరించి ప్రసాదము, స్వామివారి చిత్రపటమును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు నారాయణస్వామి, సురేష్ శర్మ, క్రిష్ణయ్య స్వామి, దాత కుటుంబ సభ్యులు, ఆలయ సిబ్బంది సుబ్బారెడ్డి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

Scroll to Top