నంద్యాల జనసేన నాయకులు రాచమడుగు చందు,సుందర్ ల జన్మదిన వేడుకలు ఘనంగా

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / మార్చి 02:

నంద్యాల పట్టణంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయం పక్కన ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ నాయకులు రాచమడుగు చందు,సుందర్ల జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు,జన సైనికులు,వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని వారి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కేకులను కట్ చేసి జనసేన పార్టీ నాయకులు రాచమడుగు చందు, సుందర్ లను శాలువాలను కప్పి,పూల హారాలు వేసి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సోషల్ మీడియా కో.ఆర్డినేటర్ ,సిరివెల్ల జనసేన నాయకులు జమాల్ బాషా మాట్లాడుతూ ఈరోజు జనసేన పార్టీ నాయకులు రాచమడుగు చందు, సుందర్ లు నంద్యాలలో జనసేన పార్టీకి ఎనలేని కృషి చేస్తున్నారని భగవంతుడు జనసేన పార్టీ నాయకులు రాచమడుగు చందు, సుందర్ లను ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఎల్లప్పుడూ ఆశీర్వదించాలని రాబోవుకాలంలో జనసేన పార్టీ లో ఎన్నో ఉన్నత పదవులను అలంకరించాలని ఆశ భావం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు రాచమడుగు చందు, సుందర్ లు మాట్లాడుతూ తమపై జనసేన పార్టీ నాయకులు,జన సైనికులు,వీర మహిళలు చూపిస్తున్న అభిమానాన్ని అభినందనలు తెలిపారు. తమపై జనసైనికులు వీర మహిళలు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు. తమ పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ అడుగుజాడలలో తాము గతంలో నుంచి కూడా నేటి వరకు ఎల్లప్పుడూ కూడా నడుస్తామని పవన్ కళ్యాణ్ ఆశయా సిద్ధాంతాలను తీసుకొని ముందు వెళతామని భవిష్యత్తులో ఎప్పుడూ కూడా జనసేన పార్టీ కార్యకర్తలకు,జనసైనికులకు,వీర మహిళలకు ఎల్లప్పుడూ తమ వంతు సహాయ,సహకారాలు రాచమడుగు కుటుంబం ద్వారా జనసేన పార్టీ నాయకులుగా సేవలందిస్తామని ఈ సందర్భంగా తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ జనసేన పార్టీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ జమాల్ బాష,సిరివెళ్ల జనసేన నాయకులు పసుపుల నరేంద్ర, నంద్యాల దేవనగర్ జనసేన నాయుకులు రాచమడుగు రాంబాబు, శివ శేఖర్, ఫరూక్, పిడిబాకుల చిన్న,సర్దార్ రవి ,ఫయాజ్, వెంకట రమణ, పృద్వి తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top