ముఖ్య అతిథిగా విచ్చేసిన టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్


సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఫిబ్రవరి 18 :
నంద్యాల స్థానిక అయ్యలూరు మెట్ట సమీపంలో బంగి హుస్సేన్ వలి నూతనంగా ఏర్పాటు చేసిన ‘లాలు స్ కేఫ్ మరియు ఫుడ్ కోర్ట్’ బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ ముఖ్య అతిథిగా హాజరై, రిబ్బన్ కట్ చేసి కేఫ్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ స్థానిక యువత స్వయం ఉపాధి దిశగా అడుగులు వేస్తూ ఇలాంటి అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఫుడ్ కోర్ట్‌లను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు . ప్రయాణికులకు, స్థానికులకు నాణ్యమైన ఆహారం మరియు పానీయాలు అందుబాటులోకి రావడం సంతోషకరమని ఆయన తెలిపారు . నిర్వాహకుడు బంగి హుస్సేన్ వలి మాట్లాడుతూ ఈ ఫుడ్ కోర్ట్‌లో టీ, కాఫీలతో పాటు టిఫిన్, భోజనం , స్నాక్స్, కూల్ డ్రింక్స్, జ్యూస్, ఐస్‌క్రీమ్ మరియు చికెన్ పకోడా వంటి ఫాస్ట్ ఫుడ్ వెరైటీలు అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. కస్టమర్ల సౌకర్యార్థం ఉచిత వై-ఫై సదుపాయాన్ని కూడా కల్పించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అయ్యలూరు టిడిపి అధ్యక్షులు త్రిలింగేశ్వర్ రెడ్డి, జంగా పెద్ద పుల్లారెడ్డి , చంద్రశేఖర్ రెడ్డి , జంగా వెంకటేశ్వర రెడ్డి , బాచిపల్లి నన్నాభాయ్ , పెట్రోల్ బంక్ హుస్సేన్ వలి మరియు కేఫ్ నిర్వాహకులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.
