నంద్యాలలో ఘనంగా “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” కార్యక్రమం

  • రాయలసీమను రాయల్ గా చేసేందుకు సీఎం చంద్రబాబు ప్రత్యేక కృషి
  • రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమాన అభివృద్దే ఉమ్మడి ప్రభుత్వ లక్ష్యం
  • అమరావతికి చట్టబద్ధత రావడం సీఎం చంద్రబాబు  చొరవ వల్లే
  • రాష్ట్ర హోం మంత్రి అనిత పై వైసిపి నాయకుల అనుచిత వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు
  • నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / జూన్ 17  : రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లలో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల ఫలితాలను ప్రజలకు వివరించేందుకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్, రోడ్లు, భవనాలు, పెట్టుబడులు,  మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బి.సి. జనార్ధన్ రెడ్డి,  నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, నంద్యాల జిల్లా ఎస్. పి సునీల్ షోరాన్,  శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా. రాజశేఖరరెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ,  నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా. జయ సూర్య, పాణ్యం  ఎమ్మెల్యే గౌరు చరిత,  నంద్యాల జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ లు పాల్గొన్నారు.

ఈ సభలో నంద్యాల పార్లమెంటు సభ్యురాలు, టీడీపీ లోక్ సభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ  రాయలసీమను రాయల్ గా ఉండేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడం మా ఉమ్మడి ప్రభుత్వ లక్ష్యం అన్నారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ఘనత వైసీపీ అధినేత జగన్ కు దక్కిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, రాష్ట్ర బీజేపీ నేతల ప్రత్యేక చొరవ, కృషి వల్ల భారత పార్లమెంట్ ద్వారా అమరావతికి చట్ట బద్దత వచ్చిందని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు.

రాష్ట్రం మా భవిష్యత్తు బాగుండాలి సంక్షేమాలు అభివృద్ధి జరగాలని 2024 ఎన్నికలలో ప్రజలు తీర్పునిచ్చారనీ, ఈ రెండు సంవత్సరాల్లో పెట్టుబడిదారులు ఈ రాష్ట్రానికి ఎలా వస్తున్నారో  వైసీపీ నాయకులతో పాటు అందరం చూస్తున్నాం అన్నారు.

అభివృద్ధి అంటే మూడు ప్రాంతాలకు వికేంద్రీకరణతో సమానంగా అభివృద్ధి జరుగుతుందని, రాయలసీమలో బతికే వాళ్ళు రాయల్ గా ఉండే విధంగా సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందన్నారు. రెండేళ్లు పూర్తికాక ముందే అమరావతిని చట్టబద్ధత చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందని, రైతన్న గురించి భరోసా ఇచి భద్రత కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వానిదనీ,  వైసీపీ ప్రభుత్వం ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకంకు  కరెంటు బిల్లు కూడా చెల్లించలేదని,  వైసిపి చేస్తున్న వెన్నుపోటుకు రెండేళ్లు సమాధానం అభివృద్ధి చేసిన పనుల కోసం కనీసం 1000 పేజీల బుక్కులు రాయాల్చి వస్తుందని ఆమె అన్నారు.

రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అమర్నాథ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసినట్లు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి తెలిపారు.

Scroll to Top