




సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 17 :
నంద్యాల జుమ్మ మసీదులో ఇఫ్తార్ విందు.. ముస్లిం సోదరులతో కలిసి నమాజ్ చేసిన మాజీ ఎమ్మెల్యేశిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి. నంద్యాల పట్టణంలో రంజాన్ వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని స్థానిక జుమ్మ మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
నంద్యాల పట్టణంలోని చారిత్రాత్మక జుమ్మ మసీదులో ముస్లిం పెద్దలు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మసీదుకు చేరుకున్న ఆయనకు ముస్లిం సోదరులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదరులతో కలిసి పంక్తిలో కూర్చుని ఇఫ్తార్ విందు స్వీకరించారు. అనంతరం దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ వారితో కలిసి నమాజ్ ఆచరించారు. పవిత్ర మాసంలో సేవా దృక్పథాన్ని చాటుకుంటూ.. ముస్లిం బాలికల మదరసా అభివృద్ధికి రవిచంద్రకిషోర్ రెడ్డి తన వంతుగా ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆయన చేసిన ఈ సాయం పట్ల మదరసా నిర్వాహకులు, ముస్లిం పెద్దలు హర్షం వ్యక్తం చేశారు.”రంజాన్ మాసం అంటేనే ప్రేమ, సహనం, మరియు దానధర్మాలకు ప్రతీక. కులమతాలకు అతీతంగా అందరూ కలిసి మెలిసి ఉన్నప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని, ఈ పవిత్ర మాసం అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, మన నంద్యాలలో ఐక్యత, సౌభ్రాతృత్వం మరింత బలపడాలని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి. కోరుకుంటున్నారు.
