డీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్‌ ను మర్యాదపూర్వకముగా కలిసిన కాళికాంబ ఆలయ నూతన పాలకమండలి

సత్యం వార్త / నంద్యాల / మార్చి 05:
శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానం నూతన పాలకమండలి చైర్మన్‌ గా ఎన్నికైన బింగుమళ్ల సుబ్బలక్ష్మయ్య , తన కమిటీ సభ్యులతో కలిసి తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆలయ ధర్మకర్తల మండలి ఏర్పాటులోనూ, నూతన కమిటీ ఎంపికలోనూ మొదటి నుండి వెన్నంటి ఉండి సహకరించినందుకు గాను చైర్మన్ సుబ్బలక్ష్మయ్య మరియు ధర్మకర్తలు ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ నూతన పాలకమండలికి శుభాకాంక్షలు తెలుపుతూ, ఆలయ అభివృద్ధికి మరియు భక్తుల సౌకర్యార్థం కమిటీ సమిష్టిగా పనిచేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బింగుమళ్ల శ్యామ్ సుందర్ గుప్త పాల్గొన్నారు.

Scroll to Top