
సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / మార్చి 05:
నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు మేజర్ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు మోమిన్ షబాన తల్లి మోమిన్ అక్తర్ బి నీ నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి పరమార్శించారు.
హైదరాబాద్ లోనీ సింధు హాస్పిటల్ లో ఆత్మకూరు మాజీ సర్పంచ్ మోమిన్ అక్తర్ బి కి మేజర్ సర్జరీ జరిగింది. విషయం తెలుసుకున్న ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలు మోమిన్ షబానతో కలిసి గురువారం ఆసుపత్రిలో ఆమెను పరమార్శించి, ఆసుపత్రి వైద్యులతో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడి మోమిన్ అక్తర్ బి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. ఆత్మకూరు మేజర్ గ్రామ పంచాయతీకి మోమిన్ ఉసెన్ సా, మోమిన్ జిలాని సుధీర్గంగా సర్పంచ్ లుగా పనిచేశారు. మహిళా రిజర్వేషన్ కావడంతో మాజీ సర్పంచ్ జిలాని భార్య మోమిన్ అక్తర్ బిని సర్పంచ్ గా పోటీ చేయించి గెలిపించారు. ఆత్మకూరు మేజర్ గ్రామ పంచాయతీ చరిత్రలో మోమిన్ కుటుంబం సుమారు 50 ఏళ్లు గ్రామ సర్పంచ్ గా పాలన చేయడం ఒక చరిత్ర. మేజర్ ఆపరేషన్ అనంతరం కోలుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఆశాభావం వ్యక్తం చేస్తూ అమ్మ ఆరోగ్యం బాగుంటుంది అని కూతురు మోమిన్ షబానాకు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మనో దైర్యం చెప్పారు.
