ట్రాక్ ఐ సొల్యూషన్స్ సీసీ కెమెరాల షాపును ప్రారంభించిన ఎన్ ఎం డి ఫిరోజ్

నంద్యాల పట్టణంలోని రైతునగరం వద్ద నూతనంగా ఏర్పాటు ప్రోప్రైటర్ షైక్ రజియా ,అహ్మద్ వలి ఏర్పాటు చేసిన ‘ట్రాక్ ఐ సొల్యూషన్స్’ సిసి కెమెరాల షోరూమ్‌ను సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, 24వ వార్డు టిడిపి ఇంచార్జి సాయిరామ్ ముఖ్య అతిథులుగా హాజరై, రిబ్బన్ కట్ చేసి షాపును ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో భద్రత అనేది అత్యంత కీలకమని, ఇళ్లు మరియు వ్యాపార సంస్థలకు సిసి కెమెరాల నిఘా ఎంతో అవసరమని పేర్కొన్నారు. పట్టణ ప్రజలకు అత్యాధునిక సాంకేతికతతో కూడిన నిఘా పరికరాలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని ఆయన కొనియాడారు.

మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు మాట్లాడుతూ వ్యాపార రంగంలో రాణిస్తూనే, ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని యజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో నంద్యాల ఇమాముల సంఘం అధ్యక్షుడు అంజాద్ బాషా సిద్ధికి , షైక్ చాంద్ బాషా, షైక్ జాఫర్, షైక్ జమాల్ బాషా, షైక్ జకీర్ హుస్సేన్, షైక్ హరోన్ రషీద్, సయద్ ఖాజా హుస్సేన్ , తెలుగు శేఖర్, మధు పెయింటర్ అసోసియేషన్, 
రెహమాన్, మాబాషా మరియు స్థానిక నేతలు, వ్యాపారస్తులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Scroll to Top