జిల్లా పోలీస్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో ఓపెన్ హౌస్ కార్యక్రమం – అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఎన్. యుగంధర్ బాబు

సత్యం వార్త / నంద్యాల జిల్లా క్రైమ్ / మార్చి 06 :
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలు 2026 లో భాగంగా ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఐపిఎస్ ఉత్తర్వులతో నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఐపిఎస్ ఆదేశాలమేరకు నేడు జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఎన్ .యుగంధర్ బాబు ఆధ్వర్యంలో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని గురురాజా,భాష్యం, నలంద, చైతన్య మొదలగు స్కూల్ విద్యార్థులను ఆహ్వానించి వారికి పోలీస్ వారు ప్రతిరోజు వారి విధులలో భాగంగా ఉపయోగించే ఆయుధాలను వాటి పనితీరు గురించి విద్యార్థులకు సవివరంగా వివరించడం జరిగింది. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఎన్. యుగంధర్ బాబు మాట్లాడుతూ 2026 అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలలో భాగంగా నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో ఓపెన్ హౌస్ (ఆయుధాల ప్రదర్శన) కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలు, చిన్నపిల్లలపై జరిగే అఘాయిత్యాలు, కొత్త చట్టాలు ముఖ్యంగా ఫోక్సో చట్టాలపై అవగాహన కల్పించడంతో పాటు మాదకద్రవ్యాల దుర్వినియోగం వాటిని వినియోగించడం వలన కలిగే దుష్ప్రభావాలపై విద్యార్థినిలకు అవగాహన కల్పించడం జరిగింది.
నంద్యాల జిల్లా వ్యాప్తంగా అన్ని స్కూళ్లను మరియు కళాశాలను శక్తి టీం బృందాలు సందర్శించి శక్తి యాప్ పై అవగాహన కల్పించడంతో పాటు శక్తి యాప్ యొక్క ప్రాముఖ్యత,ప్రయోజనాల గురించి, సమాజంలో మహిళలు చిన్నపిల్లలపై జరిగే అఘాయిత్యాలపై అప్రమత్తంగా ఉండాలని, సైబర్ క్రైమ్ నేరాలు,బాల్యవివాహాలు, రోడ్డు ప్రమాదాలు, ఫోక్సో చట్టాలు, కొత్త చట్టాలపై మరియు మహిళల భద్రత, మహిళా సాధికారతపై విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. సైబర్ క్రైమ్ నేరాలపై సంబంధిత అధికారులు వారి సిబ్బంది సహాయంతో విద్యార్థులకు ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సైబర్ క్రైమ్ నేరాలు తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి వివరించడంతో పాటు ఎవరైనా సైబర్ క్రైమ్ నేరగాళ్ల చేతిలో మోసపోతే వెంటనే 1930 నెంబర్ కు కాల్ చేసి తక్షణ సహాయం పొందవచ్చునని తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ తో పాటు మహిళ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జయరాం, రిజర్వు ఇన్స్పెక్టర్ మంజునాథ్, ఆర్ఎస్ఐ ఉమామహేశ్వర్ రెడ్డి, శ్రీనివాసులు, ఏఆర్ సిబ్బంది, మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

Scroll to Top