

సత్యం వార్త / నంద్యాల క్రైమ్ రిపోర్టర్ / జనవరి 6 : రోడ్డు ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా నంద్యాల ట్రాఫిక్ సీఐ చాంద్ బాషా ఆధ్వర్యంలో చాబోలు గ్రామంలో ప్రత్యేక ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ సిబ్బంది గ్రామస్తులతో కలిసి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలు,బ్లాక్ స్పాట్లను గుర్తించి,అక్కడ స్టాపర్లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులతో నేరుగా ట్రాఫిక్ పోలీసులు సమావేశమై,రెండు చక్రాల వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిన అవసరంపై అవగాహన కల్పించారు. హెల్మెట్ వాడటం వల్ల ప్రమాదాల సమయంలో ప్రాణ నష్టం తగ్గుతుందని,రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని వివరించారు.
ఈ సందర్భంగా నంద్యాల ట్రాఫిక్ సీఐ చాంద్ బాషా మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల సహకారం చాలా అవసరం ముఖ్యంగా రెండు చక్రాల వాహన దారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి.. గ్రామ స్థాయిలో అవగాహన పెంచితే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చు,” అని తెలిపారు..ఈ కార్యక్రమంలో గ్రామస్తులు చురుకుగా పాల్గొని ట్రాఫిక్ నియమాలు పాటిస్తామని హామీ ఇచ్చారు..
రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి అవగాహన కార్యక్రమాలను కొనసాగిస్తామని ట్రాఫిక్ సీఐ చాంద్ బాషా వెల్లడించారు.
