ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ రాష్ట్ర నాయకుడు ఎన్.ఎం.డి ఫయాజ్
భక్తిశ్రద్ధల నడుమ వైభవంగా గంధం కార్యక్రమం




సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఏప్రిల్ 05 :
నంద్యాలలోని సయ్యద్ షా మంజు పీర్ (ఆర్.ఏ) పాన్ బీడా సాహెబ్ దర్గా వద్ద ఉరుస్ మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా సయ్యద్ కరీముల్లా షజ్జాదే మరియు మోయిన్ సాహెబ్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన గంధం కార్యక్రమం భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ రాష్ట్ర నాయకుడు ఎన్.ఎం.డి ఫయాజ్, ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని నంద్యాల ప్రజలు సుఖశాంతులతో, ఐశ్వర్యంతో జీవించాలని ప్రార్థించారు. అనంతరం స్వామి వారి ఆశీస్సులు స్వీకరించారు.
ఈ వేడుకలో 11వ వార్డు టీడీపీ ఇంచార్జ్ కట్టెల అఫ్జల్ భాష, టీడీపీ నాయకుడు సర్దార్ తదితరులు పాల్గొన్నారు. కులమతాలకు అతీతంగా భారీ సంఖ్యలో భక్తులు హాజరై ఉరుస్ మహోత్సవాన్ని విజయవంతం చేశారు. ఈ మహోత్సవం ప్రాంతీయ ఐక్యతకు ప్రతీకగా నిలుస్తూ భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యం నింపింది.
