కొత్తూరు సుబ్బరాయునిలో తిరుపతి డిఎస్పీ పూజలు – ఆలయ ఈవో యం.రామక్రిష్ణ

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఏప్రిల్ 05  :

ప్రముఖ శైవక్షేత్రం పాణ్యం మండలం ఎస్.కొత్తూరు గ్రామంలో వెలసి యున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానము నందు తిరుపతి పోలీస్ ప్రైమరీ ట్రైనర్ (పిటిసి) డిఎస్పి రాజగోపాల్ రెడ్డి సతీ సమేతంగా ఆదివారం పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు సురేష్ శర్మ, వీరయ్య స్వామి ఆలయ మర్యాదలతో స్వామివారికి అభిషేకములు, అర్చనలు, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆశీర్వ మంటపము నందు శేష వస్త్రములు, శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించి ప్రసాదం అందజేశారు…

ఆలయ అభివృద్ధికి, అన్నదానమునకు 45 వేలు విరాళం… సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానమునకు అభివృద్ధి నిమిత్తం భక్తులు నలబై ఐదు వేలు విరాళంగా ఇచ్చినట్లు ఆలయ ఈవో యం.రామక్రిష్ణ ఆదివారం తెలిపారు. గోస్పాడు మండలం యాళ్ళూరు కు చెందిన మణిదీప్ రెడ్డి 25,000-/, కానాల పల్లె గ్రామానికి చెందిన భూపతి నాగశేషు లలిత సరస్వతి 10,516-/లు, కోవెలకుంట్ల పట్టణమునకు చెందిన దొంతి రెడ్డి శంకర్ రెడ్డి ఉమాదేవి 10,116-/లు విరాళంగా సమర్పించారు, వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, సిబ్బంది దాత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Scroll to Top