కొత్తూరు సుబ్బారాయుని సన్నిధిలో తెలంగాణ నిజామాబాద్ జూనియర్ సివిల్ న్యాయమూర్తులు

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 08:
 ప్రముఖ శైవక్షేత్రం పాణ్యం మండలం ఎస్.కొత్తూరు గ్రామంలో వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానమును తెలంగాణ రాష్ట్రము నిజామాబాద్ జిల్లా, జూనియర్ సివిల్ జడ్జీలు హరికుమార్, సతీమణి జడ్జి చైతన్యలు ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో యం.రామక్రిష్ణ అర్చకులు సురేష్ శర్మ, నారాయణ శర్మ, సిబ్బంది ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శ్రీ స్వామివారికి అభిషేకములు, అర్చనలు, పలు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆశీర్వ మంటపము నందు పూలమాలలు, శాలువాలు, శేష వస్త్రముతో ఘనంగా సత్కరించి స్వామివారి ప్రసాదము, స్వామివారి చిత్రపటమును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది సుబ్బారెడ్డి, నాగేశ్వరరావు, జడ్జిల బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top