అహోబిల మఠం నూతన సీఏఓ వేణుగోపాల స్వామిని కలిసిన నంద్యాల మార్కెట్ ప్రసాద్

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / మార్చి 14 :

శ్రీ అహోబిలం మఠం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ ఆదేశానుసారం అహోబిలం మఠం నూతన ముఖ్య కార్యనిర్వహణాధికారిగా (సీఏఓ) బాధ్యతలు స్వీకరించిన కేపీ వేణుగోపాలన్ (కేపీ రమేష్) స్వామిని నంద్యాల పట్టణానికి చెందిన ప్రముఖుడు మార్కెట్ ప్రసాద్ శనివారం గౌరవపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా నూతన బాధ్యతలు స్వీకరించిన స్వామివారికి మార్కెట్ ప్రసాద్ శుభాకాంక్షలు తెలియజేసి, శాలువా సమర్పించి సత్కరించారు. అహోబిలం మఠం ఆధ్వర్యంలో జరుగుతున్న ఆధ్యాత్మిక, ధార్మిక సేవలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు మఠం అభివృద్ధి చెందాలని కోరుకున్నారు.

అహోబిలం మఠం వైభవం దేశవ్యాప్తంగా మరింత విస్తరించాలని, మఠం చేపడుతున్న సేవా కార్యక్రమాలకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని మార్కెట్ ప్రసాద్ తెలిపారు.

స్వామివారిని మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా ఆధ్యాత్మిక అంశాలపై వారు పరస్పరం చర్చించుకున్నారు.

Scroll to Top