అసాంఘిక కార్యకలాపాల నియంతరణకు కట్టుదిట్టమైన చర్యలు

విజిబుల్ పోలీసింగ్ ద్వారా క్షేత్రస్థాయిలో డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ

సత్యం వార్త / నంద్యాల జిల్లా క్రైమ్ / ఏప్రిల్ 07  :

నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఐపిఎస్ ఆదేశాలమేరకు జిల్లా పోలీస్ అధికారులు వారి సిబ్బంది సహాయంతో విస్తృతంగా విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తున్నారు.

ప్రజలకు భద్రతకు భరోసా కలిగించడంతో పాటు, అసాంఘిక కార్యకలాపాలను ముందస్తుగానే గుర్తించి అడ్డుకునేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. రద్దీ ప్రాంతాలలో, పట్టణ శివారు ప్రాంతాలలో, సున్నిత ప్రాంతాల్లో పోలీస్ బలగాల ఉనికిని పెంచి నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.

అసాంఘిక కార్యకలాపాలు జరిగే అవకాశమున్న ప్రాంతాలను డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇతర రహస్య ప్రదేశాల్లో జరుగుతున్న అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించి, తక్షణమే స్పందిస్తూ సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.

ఈ సాంకేతిక పర్యవేక్షణ ద్వారా ఎలాంటి చట్ట వ్యతిరేక ఘటనలు జరగకుండా ముందస్తు నిరోధ చర్యలు అమలు చేస్తున్నారు.

శాంతిభద్రతల పరిరక్షణకు కఠిన చర్యలు జిల్లాలో శాంతి భద్రతలను కాపాడడంలో పోలీసులు ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ప్రజల భద్రతే లక్ష్యంగా పోలీస్ యంత్రాంగం కఠినమైన చర్యలు చేపడుతోంది. మరియు సమాజంలో శాంతి మరియు సుస్థిరతను పరిరక్షించేందుకు కృషి చేస్తున్నారు.

Scroll to Top