
సత్యం వార్త / నంద్యాల / ఫిబ్రవరి 08 :
నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం వెలుగోడు మండల సమీపంలోని ఆత్మకూరు రోడ్డు నందు పిల్లకాల్వ సమీపంలోని శ్రీ సర్వేశ్వరలాయము నందు మహా శివరాత్రి సందర్భంగా పాదయాత్ర చేయుచున్న శివ భక్తులందరికి అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఈ కార్యాలయంలో రాష్ట్ర బేడా బుడగజంగాల అధికార ప్రతినిధి,నంద్యాల టౌన్ 38వ వార్డు వై.యస్.ఆర్ నగర్ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి తాటికొండ బుగ్గరాముడు పాల్గొనడం జరిగింది. అనంతరం అన్నదాన కార్యక్రమానికి తన వంతుగా కమిటీ వారికి ఐదు వేల రూపాయలు విరాళం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వడ్డే నాగేంద్ర, హిమామ్ హుస్సేన్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
