హాస్టల్  సమస్యలపై ఎస్ఎఫ్ఐ పోస్ట్ కార్డ్ ఉద్యమం

తమ  సమస్యలు పరిష్కారం చేయాలనీ ముఖ్యమంత్రికి పోస్ట్ కార్డ్

సత్యం వార్త / నంద్యాల / మార్చి 06 :

ఎస్ఎఫ్ఐ నంద్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సాంఘిక సంక్షేమ, గిరిజన మరియు వెనకబడిన తరగతుల హాస్టల్ సమస్యల పరిష్కారం కోరుతూ పోస్ట్ కార్డు ఉద్యమం శ్రీకారం చుట్టడం జరిగిందని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు సుధీర్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.ఆర్.నాయక్ తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం పెరిగిన ధరలు అనుకూలంగా మెస్ కాస్మోటిక్ చార్జీలు 3000 కు పెంచాలిని, సంక్షేమ హాస్టల్స్ లో ఖాళీగా ఉన్న వార్డెన్ మరియు కుక్కు వాచ్మెన్ పోస్టులను భర్తీ చేయాలి.అద్దె భవనాల్లో నడుస్తున్న సంక్షేమ హాస్టల్స్ కు సొంతభవనాలు ఏర్పాటు చేయాలి ప్రతి సంవత్సరం సంక్షేమ హాస్టల్లో అభివృద్ధి కోసం నిధులు కేటాయించి మరమత్తులు చేయించాలి మౌలిక వసతులు కల్పించాలి. అందులో భాగంగా నంద్యాల లోని సాంఘిక సంక్షేమ,గిరిజన మరియు వెనక బడిన తరగతుల హాస్టల్ విద్యార్థుల ద్వారా రాష్ట్ర ముఖ్య మంత్రి కి పోస్ట్ కార్డులు పంపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఐ నంద్యాల టౌన్ అధ్యక్షులు శివకుమార్ నాయుకులు విజయ్, తాహిర్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top