నంద్యాల మార్కెట్ యార్డ్ సెక్రటరీ కల్పన బదిలీ

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / మార్చి 06:

నంద్యాల వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ సెక్రటరీ కల్పనను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇటీవల మార్కెట్ యార్డ్ చైర్మన్ హరిబాబు మరియు సెక్రటరీ కల్పన మధ్య జరిగిన వివాదం జిల్లాలో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.  సమావేశం సందర్భంగా చైర్మన్ హరిబాబు మాట్లాడుతున్న దృశ్యాలను సెక్రటరీ కల్పన రహస్యంగా తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన ఘటనపై ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించినట్లు సమాచారం. ఈ విషయాన్ని వెంటనే సంబంధిత ఉన్నతాధికారులు మరియు మంత్రుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఈ ఘటనను మంత్రి ఫరూక్ తీవ్రంగా పరిగణించి వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. మంత్రి సూచనల మేరకు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు విచారణ అనంతరం సెక్రటరీ కల్పనను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.  బదిలీ ఉత్తర్వుల ప్రకారం కల్పన వెంటనే అమరావతిలోని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కార్యాలయంలో హాజరై రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మార్కెట్ యార్డ్‌లో ఇటీవల జరిగిన పరిణామాలు జిల్లా వ్యాప్తంగా చర్చకు దారి తీసిన నేపథ్యంలో ఈ బదిలీ ప్రాధాన్యత సంతరించుకుంది.

Scroll to Top