సిఐటియు రాష్ట్ర మహాసభల సందర్భంగా నంది సాంస్కృతిక కార్మిక ఉత్సవాలను జయప్రదం చేయండి

సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందారపు మురళి పిలుపు

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఫిబ్రవరి 24 :
సిఐటియు రాష్ట్ర 17వ మహాసభలు నంద్యాల పట్టణంలో 2026 ఏప్రిల్ 17, 18, 19 తేదీలలో జరుగుతున్నాయి. ఈ మహాసభల సందర్భంగా నంది సాంస్కృతిక కార్మిక ఉత్సవాలు ఏప్రిల్ 14, 15, 16, 17, తేదీలలో సాంస్కృతిక కార్మిక ఉత్సవాలను జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ కందారపు మురళి పిలుపునిచ్చారు.
స్థానిక నంద్యాల పట్టణంలోని సుందరయ్య భవన్లో సిఐటియు జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం సిఐటియు జిల్లా అధ్యక్షులు ఏసురత్నం అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ కందారపు మురళి హాజరై మాట్లాడుతూ ఉద్యోగ కార్మిక ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిఐటియు నిత్యం ఆందోళన పోరాటాలు చేస్తుందని కార్మిక హక్కులు సంక్షేమంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలో విదేశీ పరిశ్రమల రక్షణ కోసం ఐక్య పోరాటాలు నిర్వహిస్తుందని సంస్కరణల పేరిట పడుతున్న బారాలపై ప్రజానీకాన్ని చైతన్యవంతం చేస్తూ పోరాటాలు నిర్వహిస్తుందని స్కీం వర్కర్లు ఇతర అసంఘటిత కార్మికుల ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటాలు నిర్వహిస్తుందని పకృతి వైపరీత్యాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సందర్భంలో సేవా కార్యక్రమానికి తోడ్పాటు అందిస్తుందని ఈ నేపథ్యంలో సిఐటియు రాష్ట్ర మహాసభలో మొట్టమొదటిసారిగా నంద్యాల పట్టణంలో 2026 ఏప్రిల్ 17 18 19 తేదీలలో సిఐటియు రాష్ట్ర మహాసభలో జరుగుతున్నాయని ఈ రాష్ట్ర మహాసభల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నంద్యాల పట్టణంలో నీ టౌన్ హాల్ నందు నాలుగు రోజులపాటు జరుగుతాయని ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో సినీ నిర్మాతలు సుద్దాల అశోక్ తేజ, మంగ్లీ, సినీ నిర్మాతలు పాల్గొంటున్నారని అలాగే రాష్ట్రవ్యాప్తంగా సాంస్కృతిక కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని వీటన్నిటిని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
కేంద్రంలో బిజెపి ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత దూకుడుగా వ్యవహరిస్తుందని కార్మిక వర్గం అనేక త్యాగాలతో సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోట్లుగా మార్చి కార్మికులను కట్టు బానిసల్లగా చేస్తుందని లాభాల్లో నడుస్తున్నటువంటి ప్రభుత్వ రంగ సమస్యలన్నిటిని కారు చౌకగా అమ్మి వేసే ప్రయత్నం చేస్తుందని మన రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వంగ సంస్థ అయినా విశాఖ స్టీల్ ప్లాంట్ ని ముక్కలు చేసి అమ్మాలని విష్ణ ప్రయత్నాలు చేస్తుందని దీనికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యోగులు కార్మికులుకు సన్నద్ధం కావాలని విశాఖ స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించకుండా ప్రైవేట్ మిట్టల్ కంపెనీలకు గనులను కట్టబెడుతున్నారని చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని ప్రైవేటు చేతుల్లో పెట్టేందుకు పావులు కలుపుతున్నారని ప్రత్యేక హోదా ఇవ్వకపోగా విభజన హామీలు అమలు చేయకపోగా కడప ఉక్కు పరిశ్రమ స్థాపనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నించకపోగా వంత పాడటం దుర్మార్గమైన చర్య అని ఎనిమిది గంటల పని విధానాన్ని 10 గంటలకు 12 గంటలకు పెంచిందని మహిళలకు రాత్రిపూట చెట్లలో పనిచేసుకునేందుకు అనుమతిస్తూ చట్టం చేసిందని ఇది కార్మికులను మరింత దోపిడీ చేయడానికి అవకాశం కల్పించిందని వీటికి వ్యతిరేకంగా కార్మికులు ఉద్యోగులు ప్రజలందరూ సిఐటియు రాష్ట్ర మహాసభల సందర్భంగా జరుగు నంది సాంస్కృతిక కార్మిక ఉత్సవాలను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు అనంతరం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ నాగరాజు గారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వై ఎల్లయ్య కేఎండి గౌస్ సిఐటియు కోశాధికారి ఏ తిరపతయ్య, రమణకుమారి సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి వి బాల వెంకట్, డి లక్ష్మణ్, వెంకట్ లింగం, నిర్మలమ్మ, రామ్ నాయక్ లు పాల్గొన్నారు.

Scroll to Top