శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానము అభివృద్ధికి 50,000 వేలు విరాళం

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 21 :

ప్రముఖ శైవ క్షేత్రం లక్షలాది మంది భక్తుల ఆరాద్య దేవమైన పాణ్యం మండలం. ఎస్. కొత్తూరు గ్రామంలో వెలసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానము  ఆలయము అభివృద్ధి నిమిత్తం భక్తులు 50,000 వేల రూపాయల విరాళం శనివారం సమర్పించినట్లు ఆలయ ఈవో ఎం. రామక్రిష్ణ తెలుపారు. పాణ్యం పట్టణ మునకు చెందిన మాదాసు వెంకట చంద్ర శేఖర్ బాబు సతీమణి విజయలక్ష్మి దంపతులు వారికి స్వామి వారు ఇంటి ఇలవేల్పు కావడంతో  మొక్కబడిగా  50,000 వేలు విరాళంగా ఇచ్చారు. వీరికి ఆలయ మర్యాదలతో శ్రీ స్వామివారికి అభిషేకములు అర్చనలు విశేష పూజలు నిర్వహించి శేషవస్త్రములు.  పూలమాలలతో సత్కరించి ప్రపాదము అందజేశారు. ఈ కార్యకి మములో బేతంచెర్ల పాణ్యం సిమెంటు జూనియర్ కళాశాల ప్రిన్సిపల్  బాలక్రిష్ణ ఉపాధ్యాయురాలు రాధిక సిబ్బంది పాల్గొన్నారు.

Scroll to Top