పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్ఎండీ ఫయాజ్

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఏప్రిల్ 01 :
38వ వార్డు వైఎస్సార్ నగర్లో రాష్ట్ర తెలుగు యువ నాయకుడు ఎన్ఎండీ ఫయాజ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పింఛన్లు పంపిణీ చేశారు. తదనంతరం వార్డులోని డ్రైనేజీ వ్యవస్థ, రహదారులు, ఎలక్ట్రికల్ సౌకర్యాలు మరియు మురికి కాలువలను పరిశీలించారు. అక్కడ ఉన్న సమస్యలను గుర్తించిన ఫయాజ్, వెంటనే మున్సిపల్ అధికారులతో మాట్లాడి రోడ్లు మరియు డ్రైనేజీ పనులు త్వరగా ప్రారంభించాలని ఆదేశించారు. అనంతరం సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు అడ్వకేట్ నందము బాబురావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఫయాజ్ మాట్లాడారు. ప్రజల సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని, అందరూ కలిసికట్టుగా పనిచేస్తే వాటిని పరిష్కరించగలమని ఆయన హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో 38వ వార్డు ఇంచార్జీలు శివ నాగిరెడ్డి, మరాటి సూరి, బుగ్గ రాముడు, ఇమాము నాగేంద్ర, రాఘవేంద్ర స్వామి, దాస్ పాస్టర్, సురేష్ పాస్టర్, సౌభాగ్య ప్రసాదరెడ్డి, నాగరాజు, కోటి, అడ్వకేట్ నందము భరత్, బుగ్గ మహేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు స్థానికులు పాల్గొన్నారు.
