
నంద్యాల పట్టణం నూనెపల్లె బొగ్గులైన్ రోడ్డు నందు జరిగిన రోడ్డు ప్రమాదంలో పట్టణానికి చెందిన కామిరెడ్డి రాజ ఇమ్మనియేల్ విన్స్టన్ చర్చిల్ (62) ద్విచక్ర వాహనం పై వెళ్తుండగా వేగంగా దూసుకెళ్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొనగా ద్విచక్ర వాహనం పై వెళ్తున్న ఇద్దరిలో ఒకరైన కామిరెడ్డి రాజ ఇమ్మనియేల్ విన్స్టన్ చర్చిల్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు పట్టణంలోని సెయింట్ లూక్స్ అంధుల పాఠశాలలో ఫీల్డ్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య కుమారుడు, కూతురు ఉన్నారు. నూనెపల్లె బొగ్గులైన్ రోడ్డు నందు అనేక రోడ్డు ప్రమాద ఘటనలో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టి విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.
