రబీ సీజన్లో పంట ఆప్ లో 12465 హెక్టార్లలో నమోదు

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / మార్చి 11 :

రబీ సీజన్లో మండలంలో 12465 హెక్టార్లలో వివిధ పంటలు సాగుచేశారని, వీటికి సంబంధించిన వివరాలను పంట ఆప్ లో నమోదుచేసినట్టు వ్యవసాయ అధికారి ప్రసాదరావు పేర్కొన్నారు.  నంద్యాల మండలములోని కొత్తపల్లి, పుసులూరు,  భీమవరం గ్రామములలో నిర్వహించిన గ్రామ సభలలో మండల వ్యవసాయ అధికారి ప్రసాద్ రావు పాల్గొనటం జరిగినది. ఈ గ్రామసభల్లో రబీ కాలంలో ఈ పంటలో నమోదు చేసిన  పంటల వివరాలను రైతులకు తెలియజేయడమైనది. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి ప్రసాద్ రావు మాట్లాడుతూ రబీ కాలంలో మండలంలో 12465 హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేశారని, వీటికి సంబంధించిన వివరాలను ఈ పంట ఆప్ నందు నమోదు చేయబడినవనీ, తెలిపారు. పంట నమోదుకు సంబంధించిన రైతుల జాబితాను మండలంలోని అన్ని రైతు సేవా కేంద్రాల్లో ప్రదర్శించడం జరిగిందని, రైతులు వారి పంటలకు సంబంధించిన వివరాలు  చూసుకొని, ఏవైనా మార్పులు అవసరమైనచో సంబంధిత రైతు సేవా సిబ్బందికి తెలిజేసి సరి చేసుకోగలరని తెలిపారు. ఈ అవకాశం ఈ నెల 14 వ తేదీ వరకు ఉన్నదని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

వరి పొలాలా సందర్శన: మండల వ్యవసాయ అధికారి నంద్యాల కొత్తపల్లి గ్రామంలో వరి పొలాలను సందర్శించి రైతులకు పలు సూచనలు చేయడం జరిగినది. ప్రస్తుతం వరి పంటలో కంకి నల్లి ఆశించడం జరిగిందని, దీని నివారణకు ప్రొఫినోఫోస్ 2 మి. లి  లీటర్ నీటికి కలిసి పిచికారి చేసుకోవాలని, అలాగే వరి లో తాలు గింజలు తగ్గించి గింజ గట్టిపడుటకు 19:19:19 అను పోషకమును 5 గ్రా లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలని తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో  వ్యవసాయ విస్తరణాధికారులు మహేష్, బాల లింగామయ్య , గ్రామ వ్యవసాయ సహాయకురాలు లలిత, సురేష్ , మహేంద్ర గ్రామ రైతులు పాల్గొన్నారు.

Scroll to Top