రైతు కు ఇచ్చే సబ్సిడీలు, మహిళా రుణాలపై ఆరా
మార్కెట్ యార్డ్ షాపులను వెంటనే ప్రభుత్వానికి అప్పగించాలి
టెక్కె ప్రాంతంలో మంత్రి ఫరూక్ ఆకస్మిక తనిఖీ






సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఏప్రిల్ 06 :
నంద్యాల పట్టణంలోని టెక్కె ప్రాంతంలో ఉన్న వివిధ సహకార సంస్థలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫరూక్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన శిల్పా సూపర్ మార్కెట్, శిల్పా మహిళా సహకార్, శిల్పా రైతు సమాఖ్య మరియు నంది రైతు సమాఖ్యలను నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు ఆధ్వర్యంలో మంత్రి వర్యులు ఎన్ఎండి ఫరూక్ స్వయంగా తనిఖీ చేశారు. మంత్రి ఫరూక్ షాపులన్నింటినీ కలియతిరుగుతూ, రైతులకు అందిస్తున్న సబ్సిడీలు, మహిళలకు మంజూరు చేస్తున్న రుణాలు మరియు సామాన్య ప్రజలకు నిత్యవసర సరుకులపై ఇస్తున్న డిస్కౌంట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఈ షాపుల లీజు గడువు ముగిసినందున, వాటిని నిర్వహిస్తున్న వారు వెంటనే మార్కెట్ యార్డ్‌కు షాపులను అప్పగించాలని మంత్రి ఫరూక్ ఆదేశించారు. “ప్రస్తుతం ఒక్కో షాపుకు కేవలం రూ. 2,700 మాత్రమే అద్దె చెల్లిస్తున్నారు, ఇది వాస్తవ మార్కెట్ ధర కంటే చాలా తక్కువ. ఇదే ప్రాంతంలో ఎదురుగా ఉన్న షాపుల అద్దె రూ. 15,000 నుండి రూ. 20,000 వరకు ఉందని . ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా ఉండేందుకు వీటిని వెంటనే హ్యాండోవర్ చేయాలి” అని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మార్కెట్ యార్డ్ ఆస్తులను సక్రమంగా వినియోగించుకోవాలని, లీజుదారులు సహకరించాలని ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ సూచించారు
ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తులు ప్రజల ప్రయోజనాల కోసం ఉపయోగపడాలని . టెక్కె ప్రాంతంలోని ఈ షాపుల లీజు గడువు ఎప్పుడో ముగిసిపోయిందని . ప్రస్తుతం ఇక్కడ ఒక్కో షాపుకు కేవలం ₹2,700 మాత్రమే అద్దె చెల్లిస్తుండటం గమనార్హం అన్నారు. సరిగ్గా వీటికి ఎదురుగా ఉన్న ప్రైవేటు షాపుల బాడుగలు ₹15,000 నుండి ₹20,000 వరకు పలుకుతున్నాయిని . ఇలాంటి పరిస్థితుల్లో అతి తక్కువ అద్దెకు ప్రభుత్వ షాపులను కొనసాగించడం వల్ల మార్కెట్ యార్డ్ ఆదాయానికి భారీగా గండి పడుతోందని తెలిపారు . కాబట్టి, లీజుదారులు వెంటనే స్పందించి ఈ షాపులను మార్కెట్ యార్డ్ అధికారులకు హ్యాండోవర్ చేయాలని. అదేవిధంగా, రైతులకు ఇచ్చే సబ్సిడీలు, మహిళలకు అందే రుణాలు మరియు ప్రజలకు నిత్యవసర వస్తువులపై ఇచ్చే రాయితీలు క్షేత్రస్థాయిలో అర్హులకు సక్రమంగా అందుతున్నాయో లేదో అధికారులు నిరంతరం పర్యవేక్షించాలి. అని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రంగ ప్రసాద్, డైరెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.
