రైతు నగర్లోఈశ్వరి మినరల్ వాటర్ ప్లాంట్ పై తీవ్ర ఆరోపణలు

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 09 :
నంద్యాల పట్టణంలోని రైతు నగర్ ప్రాంతంలో కొనసాగుతున్న ఈశ్వరి మినరల్ వాటర్ ప్లాంట్ పై స్థానిక ప్రజలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు..అపరిశుభ్రమైన వాతావరణంలోనే నీటిని శుద్ధి చేస్తున్నారని,ప్రజలకు సరైన నాణ్యత గల ప్యూరిఫైడ్ వాటర్ అందించడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..స్థానికుల వివరాల ప్రకారం ప్రజల నుండి బిందెకు ₹10,క్యాన్‌కు ₹20 చొప్పున వసూలు చేస్తూ యాజమాన్యం సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు..అయితే అంత మొత్తంలో సొమ్ము వసూలు చేస్తున్నప్పటికీ నీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెబుతున్నారు..ప్లాంట్‌లో పరిశుభ్రత లేకపోవడం,నీటి శుద్ధికరణ యంత్రాలను సమయానికి శుభ్రపరచడం లేదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.అలాగే ప్లాంట్ పరిసరాల్లో పరిశుభ్రత లేకపోవడం వల్ల నీటి నాణ్యతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు..ప్లాంట్‌కు అవసరమైన పర్మిషన్లు ఉన్నాయా..?..ఉంటే ఎప్పుడు తీసుకున్నారు..??..లైసెన్సులు గడువు ముగిసిన తర్వాత రెన్యువల్ చేసుకున్నారా..??..శుద్ధికరణ యంత్రాలను సమయానికి శుభ్రపరుస్తున్నారా..??..నీటి నాణ్యతపై ల్యాబ్ టెస్ట్ రిపోర్టులు ఉన్నాయా..??..ప్రజలకు సరైన మినరల్స్ ఉన్న నీటినే అందిస్తున్నారా..??..అనే ప్రశ్నలు స్థానిక ప్రజలు లేవనెత్తుతున్నట్లు తెలుస్తోంది..!!
..సాధారణంగా ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ లేదా మినరల్ వాటర్ ప్లాంట్ నడపాలంటే పుడ్ సేఫ్టీ మరియు స్టాండర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) లైసెన్స్ తో పాటు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ (బిఐఎస్) ప్రమాణాలు తప్పనిసరి.అలాగే పర్యావరణ పరిరక్షణ నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనుమతులు కూడా తీసుకోవాలి..ఈ లైసెన్సులు సాధారణంగా నిర్దిష్ట కాలానికి మాత్రమే చెల్లుబాటు అవుతాయి…గడువు ముగిసిన తర్వాత తప్పనిసరిగా రెన్యువల్ చేసుకోవాలి..అయితే రైతు నగర్లో ఉన్న ఈ ప్లాంట్ యాజమాన్యం ఈ నిబంధనలను పూర్తిగా పాటిస్తున్నదా?? లేదా?? అన్న సందేహాలు ఇప్పుడు స్థానిక ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి…వేసవికాలం ప్రారంభం కావడంతో పట్టణంలో మినరల్ వాటర్‌కు డిమాండ్ పెరిగింది…దీనిని కొందరు వ్యాపారులు అవకాశంగా మార్చుకుని పేరుకు మాత్రమే మినరల్ వాటర్ ప్లాంట్ అనే బోర్డులు పెట్టుకుని సరైన నాణ్యత గల నీటిని అందించకుండా ప్రజలను దోచుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి…ప్రజల ఆరోగ్యంతో ముడిపడి ఉన్న అంశం కావడంతో సంబంధిత శాఖ అధికారులు వెంటనే ఈశ్వరి మినరల్ వాటర్ ప్లాంట్‌ను సందర్శించి,తనిఖీలు నిర్వహించి,నీటి నాణ్యతపై పరీక్షలు చేసి,యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు..“ప్రజల ఆరోగ్యంతో ఆటలు ఆడకూడదు – అధికారులు వెంటనే స్పందించి నిజానిజాలు బయటపెట్టాలి” అని స్థానికులు కోరుతున్నారు.
