విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే సాంకేతిక పరిజ్ఞానం, కమ్యూనికేషన్స్ నైపుణ్యాలు అవసరం

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / మార్చి 09 :

ప్రస్తుత కాలంలో విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు కావాలంటే సాంకేతిక పరిజ్ఞానం,కమ్యూనికేషన్స్ నైపుణ్యాలు,జీవన నైపుణ్యాలు అవసరమని  శ్రీ రామకృష్ణా విద్యాసంస్థల చైర్మెన్ డాక్టర్ జి.రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు.  శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి), నంద్యాలలో  మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో ఐ .బి.ఎం.కనెక్ట్ విత్ వర్క్ పోగ్రామ్ సహకారంతో నిర్వహిస్తున్న ట్రైనింగ్, ప్లేస్మెంట్ పోగ్రామ్ ప్రారంభించారు. ఈ శిక్షణ కార్యక్రమం 09-03-2026 నుండి 14-03-2026 వరకు 6 రోజుల పాటు కళాశాలలో నిర్వహించబడుతుంది.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల ఛైర్మన్ డా. జి. రామకృష్ణ రెడ్డి  పాల్గొని శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేటి కాలంలో విద్యార్థులు ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే సాంకేతిక పరిజ్ఞానం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరియు జీవన నైపుణ్యాలు చాలా అవసరమని తెలిపారు. ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగకరమని ఆయన అన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో విద్యార్థులకు  ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పరిచయం,కస్టమర్ సర్వీస్ రిప్రిజెంటివ్ స్కిల్స్,ఎంప్లయబిలిటీ స్కిల్స్ ,లైఫ్ స్కిల్స్ వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణ అందించనున్నారు. అలాగే శిక్షణ అనంతరం విద్యార్థులకు ఉచిత ఉద్యోగ అవకాశాల కోసం ప్లేస్మెంట్ సపోర్ట్ కూడా అందించబడుతుందని నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కె.బి.వి. సుబ్బయ్య , డీన్ ఆఫ్ అకాడెమిక్స్ *ఏ.ఎస్. ప్రగతి రెడ్డి , కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి *డా. యు.వి.ఎస్. కుమార్ ట్రైనింగ్ & ప్లేస్‌మెంట్ ఆఫీసర్ కె. సంపత్ కుమార్  పాల్గొన్నారు. ప్రారంభోత్సవంలో కళాశాల అధ్యాపకులు , విద్యార్థులు పాల్గొనడం జరిగింది.

ఈ శిక్షణ కార్యక్రమాన్ని *కె. దశరథ్ , ఐ. అన్సారి , టి. పవన్ కుమార్ , ఎన్. భారత కుమార్  ట్రైనర్లుగా నిర్వహిస్తున్నారు. కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని శిక్షణను ఆసక్తిగా స్వీకరిస్తున్నారు.

Scroll to Top