పీఎం సూర్య ఘర్ పథకం ద్వారా జిల్లాను గ్రీన్ ఎనర్జీగా తీర్చి దిద్దడం జరుగుతుంది

ప్రతి ఇంటిపై సోలార్ వెలుగులు నింపేందుకు చర్యలు తీసుకుంటున్నాం

జిల్లాలో 116 ఎకరాలలో పీఎం కుసుం ప్రాజెక్టు నిర్మాణం

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయనంద్ కు వివరించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / జనవరి 21 :
ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం ద్వారా నంద్యాల జిల్లాను గ్రీన్ ఎనర్జీగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయనంద్ కు సూచించారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అమరావతి సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో పీఎం కుసుం, పీఎం సూర్య ఘర్ పథకాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
నంద్యాల జిల్లాలోని ఎన్ఐసి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, ట్రాన్స్కో అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా మాట్లాడుతూ…. నంద్యాల జిల్లాలో పీఎం సూర్య ఘర్ పథకానికి సంబంధించి 22,590 మంది ఎస్సీ, ఎస్టీల గృహాలపై సోలార్ వెలుగులు నింపేందుకు లక్ష్యంగా ముందుకు వెళుతున్నామన్నారు. ఈ పథకానికి సంబంధించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి వచ్చే జూన్ మాసం లోపల కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని సీఎస్ కు వివరించారు. పీఎం సూర్య ఘర్ పథకం ద్వారా నంద్యాల జిల్లాను గ్రీన్ ఎనర్జీగా తీర్చి దిద్దడం జరుగుతుంది. ఇందుకు సంబంధించి ఎస్సీ ఎస్టీ కాలనీలలోని ఇళ్ల యజమానులకు పిఎం సూర్య ఘర్ పథకం పై అవగాహన కల్పించి ప్రతి ఇంటిపై సోలార్ వెలుగులు నింపడమే లక్ష్యంగా అధికారులకు నిర్దేశించామన్నారు.
నంద్యాల జిల్లాలో 116 ఎకరాలలో పీఎం కుసుం ప్రాజెక్టు నిర్మించడం జరుగుతుందని ఇందుకు సంబంధించి 12 ఎకరాలు ప్రభుత్వ భూమి, 104 ఎకరాలు ప్రైవేటు భూమిలో పీఎం కుసుం ప్రాజెక్టును నెలకొల్పేందుకు చర్యలు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఈ పథకానికి సంబంధించి ఎటువంటి భూ సమస్య లేదని జిల్లా కలెక్టర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. విజయానంద్ కు నివేదించారు.

Scroll to Top