- మంత్రి వర్యులు ఎన్ఎండి.ఫరూక్ సతీమణి ఎన్ఎండి.షహనాజ్ జ్ఞాపకార్ధంతో పేద ముస్లిం వితంతు మహిళలకు చీరలు,నిత్యావసర సరుకులు (తోఫా) పంపిణీ కార్యక్రమం.
- పేద వితంతు ముస్లిం మహిళలకు చీరలు, నిత్యావసర సరుకులు (తోఫా)పంపిణీ చేసిన నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి.ఫిరోజ్


సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 15 :
నంద్యాల టౌన్ 38వ వార్డు వై.యస్.ఆర్ నగర్ నందు రంజాన్ పండుగ సందర్భంగా మంత్రి వర్యులు ఎన్ఎండి.ఫరూక్ సతీమణి జ్ఞాపకార్ధంగా పేద వితంతు ముస్లిం మహిళలకు నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి.ఫిరోజ్ చేతుల మీదగా చీరల పంపిణీ చేసిన 38వ వార్డు ఇంచార్జి తాటికొండ బుగ్గరాముడు.ఈ కార్యక్రమంలో ఎన్ఎండి. ఫిరోజ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రంజాన్ మరియు క్రిస్టమస్ పండగలకు చీరల పంపిణి మరియు నిత్యావసర సరుకులు (తోఫా) పంపిణీ చేస్తున్న బుగ్గరాముడు ని అభినందించారు.అదేవిధంగా వార్డు నందు రోడ్లు, డ్రైనేజి, వీధి లైట్లు ఎటువంటి సమస్య ఉన్న త్వరితగతిన పూర్తిచేసి వార్డును మరింత అభివృద్ధి బాటలో ముందుకు తీసుకువెళతాము అని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో బుగ్గరాముడు మాట్లాడుతూ పండుగ వేళా పేదలకు చీరల పంపిణీ మరియు నిత్యవసర సరుకులు(తోఫా) పేదలకు పంచడం చాలా ఆనందంగా ఉంది అని ఆయన అన్నారు. అదేవిధంగా వార్డు నందు ఎవరు మరణించిన,ఎవరి వివాహం జరిగిన వారికి మంత్రి వర్యులు ఎన్ఎండి.ఫరూక్, ఎన్ఎండి.ఫిరోజ్, ఎన్ఎండి.ఫయాజ్ అదేశాలతో వారికి ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది అని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో తాటికొండ మహేష్ బాబు,అడ్వకేట్ నందము బాబు రావు, హిమామ్ హుస్సేన్, వడ్డే నాగేంద్ర, కల్కి రాఘవేంద్ర, కోటీశ్వరుడు, సౌభాగ్యవతి, ప్రసాద్ రెడ్డి, నాగేశ్వరరావు, శ్రీకాంత్ నాయుడు,పద్మ, సాయిరాం లాయర్,తదితర టీడీపీ నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
