

సత్యం వార్త / నంద్యాల జిల్లా క్రైమ్ / ఫిబ్రవరి 26:
నంద్యాల టూ టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీ అస్రార్ భాష నంద్యాల ఈగల్ టీంతో పాటు నంద్యాల పట్టణంలోని న్యూక్లియస్ జూనియర్ కళాశాల యొక్క బాయ్స్ హాస్టల్ నందు దేశాన్ని ప్రేమించే ఏ వ్యక్తి కూడా డ్రగ్స్ ముట్టుకోరు అనే నినాదంతో డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమం ఏర్పాటు చేయడంతో పాటు విద్యార్థులకు గంజాయి మరియు మాదకద్రవ్యాల వినియోగం వలన వచ్చే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించడం జరిగింది. మాదకద్రవ్యాలు రవాణా చేసిన వినియోగించిన విక్రయించిన చట్ట ప్రకారం నేరంగా పరిగణించడం జరుగుతుంది. మత్తు పదార్థాలకు దూరంగా ఉండి మీ బంగారు భవిష్యత్తును కాపాడుకోవాలని పలు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. మత్తుపదార్థాలకు సంబంధించిన సమాచారం ఉంటే పోలీసులకు కానీ ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 కు కాల్ చేసి తెలియజేయాలని, తెలియజేసిన వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలియజేయడం జరిగింది.
