కుటుంబ కలహాలతో కుందునదిలోకి దూకి ఆత్మహత్య ప్రయత్నం చేసిన మహిళను కాపాడిన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మరియు వారి సిబ్బంది

సత్యం వార్త / నంద్యాల జిల్లా క్రైమ్ / ఫిబ్రవరి 26:
నంద్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ చాంద్ భాషా తమ సిబ్బందితో కలిసి నేటి మధ్యాహ్నం విధినిర్వహణ నిమిత్తం వై యస్ ఆర్ నగర్ వెళ్లే బ్రిడ్జిపై వెళ్తుండగా ఒక మహిళ బ్రిడ్జి పై నుండి కుందూ నదిలోకి దూకేందుకు ప్రయత్నిస్తుండగా అప్రమత్తమైన ఇన్స్పెక్టర్ గారు తమ సిబ్బంది నాగాయ్య,  ఆలాం,  నాగ శేషు లు పోలీస్ వాహనం నుంచి త్వరగా దిగి ఆ మహిళను కాపాడడం జరిగింది.
బ్రిడ్జి ఫైన నుంచి అటుగా వెళ్లుచున్న పెద్ద మనుష్యులను ఆపి సదరు మహిళను వారి సమక్షంలో విచారించగ సదరు మహిళ తన పేరు వివరాలు తెలియజేస్తూ ఉదయం నాతో నా భర్త మరియు నా అత్త గొడవపడి నన్ను చాలా బాధ పెట్టినారని అందుకు నేను ఆత్మహత్య చేసుకునేందుకు కుందు నదిలోకి దునకుతుండగా మీరు వచ్చి పట్టుకున్నారు.నేను చచ్చిపోవాలని నిర్ణయించుకొని నాకు వున్నా ఒక కుమారుణ్ణి స్కూల్ వద్ద వదిలి వచ్చినాని ఏడుస్తూ చెప్పుచుండగా మేము మరియు పెద్ద మనుష్యుల సహాకారం తో ఆమెను ఓదార్చి అక్కడి నుంచి పోలీస్ వాహనం నందు ఆమెను ఆమె యింటి వద్దకు తీసుకొని పోయి ఆమె యొక్క మామ, అక్క మరియు అన్నల సమక్షంలో అప్పగించడం జరిగింది.

Scroll to Top