నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో న్యూట్రిషన్ కిట్లు పంపిణి

సత్యం వార్త / నంద్యాల / ఫిబ్రవరి 21 :

నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ లో ఉన్న నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పటల్లో టీబీ పేషెంట్లకు న్యూట్రిషనల్ కిట్లను పంపిణీ చేసినట్లు డాక్టర్ నెరవాటి అరుణకుమారి డాక్టర్ నెరవాటి వినోద్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతినెల ప్రధానమంత్రి టీబి ముక్త్ భారత్ అభియాన్ నీ క్షయ మిత్ర  టిబి పేషెంట్లకు ఉచితంగా పౌష్టికాహారాన్ని పంపిణీ చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ నెరవాటి వినోద్ కుమార్ మాట్లాడుతూ గత మూడు నెలలుగా టీబీ పేషెంట్లకు పౌష్టిక ఆహారాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు.శనివారం నంద్యాల పట్టణంలోని నెరవాటి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నందు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top