నంద్యాల ఐఎంఏ ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం

క్షయ వ్యాధి నుండి కోలుకుంటున్న 25 మందికి 35 వేల రూపాయల విలువ చేసే పోషకాహార సరుకుల కిట్ల పంపిణీ

ఐఎంఏ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తాం – నంద్యాల ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్

క్షయ వ్యాధి రహిత భారత్ సాధించడమే లక్ష్యం – ఐఎంఏ జాతీయ కేంద్ర కమిటీ సభ్యులు డాక్టర్ రవి కృష్ణ

ప్రభుత్వాసుపత్రిలో నాణ్యమైన క్షయ వ్యాధి మందులు ఉచితంగా అందిస్తున్నాం – నంద్యాల క్షయ వ్యాధి వైద్యాధికారి డాక్టర్ అంకిరెడ్డి

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఏప్రిల్ 07  :

మంగళవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకుని, స్థానిక మధుమణి ఆసుపత్రి ప్రాంగణంలో నంద్యాల ఐఎంఏ ఆధ్వర్యంలో, నంద్యాల జిల్లా క్షయ వ్యాధి నివారణ కేంద్రం సమన్వయంతో  క్షయ వ్యాధి నుండి కోలుకుంటున్న 25 మందికి నంద్యాల ఐఎంఏ వైద్యుల ఆర్థిక సహకారంతో మూడు నెలలకు సరిపడా 35 వేల రూపాయల విలువగల పోషకాహార సరుకుల కిట్లను అందజేయడం జరిగింది.

నంద్యాల ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాసరావు అధ్యక్షతన, కార్యదర్శి  డాక్టర్ మహమ్మద్ రఫీ నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో జాతీయ ఐఎంఏ కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర మాజీ ఐఎంఏ అధ్యక్షులు, రాష్ట్ర ఐఎంఏ యాక్షన్ కమిటీ చైర్మన్ డాక్టర్ రవి కృష్ణ, నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి క్షయ వ్యాధి అధికారి డాక్టర్ అంకిరెడ్డి, ఐఎంఏ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ పనిల్ కుమార్, రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ మధుసూదన రెడ్డి, ఐఎంఏ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు డాక్టర్ విజయ భాస్కర్ రెడ్డి, నంద్యాల ఐఎంఏ మహిళా విభాగం అధ్యక్షురాలు డాక్టర్ మాధవి, కార్యదర్శులు డాక్టర్ సునీత, డాక్టర్ లలిత, ఐఎంఏ నంద్యాల కార్యవర్గ సభ్యులు డాక్టర్ చిత్తలూరు మణిదీప్ పాల్గొని పోషకాహార సరుకుల కిట్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ క్షయ వ్యాధి రహిత భారతదేశం సాధించడమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్య సంఘాలు సంయుక్త కృషి చేస్తున్నాయని, క్షయ వ్యాధిగ్రస్తులు మందులతో పాటు పోషకాహార విలువలు గల ఆహారం తీసుకోవడం ద్వారా త్వరితగతిన కోలుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.

డాక్టర్ అంకిరెడ్డి మాట్లాడుతూ రోగులకు ఈ పోషకాహార సరుకుల కిట్లను స్వచ్ఛంద సంస్థల సహకారంతో జిల్లా క్షయ వ్యాధి నివారణ కేంద్రం సమన్వయంతో ప్రతినెల పంపిణీ చేస్తున్నామని,క్షయ వ్యాధి రోగులకు ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యంత నాణ్యమైన మందులను ఉచితంగా అందజేస్తున్నామని,బయట కొనుక్కోవలసిన అవసరం లేదని వివరించారు.

డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ నంద్యాల ఐఎంఏ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వహణ కు సహకరించిన నంద్యాల జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి డాక్టర్ శారదా బాయ్ కి ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో నంద్యాల ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ మహమ్మద్ రఫీ,ఐఎంఏ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ పనిల్ కుమార్, రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ మధుసూదన రెడ్డి, ఐఎంఏ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు డాక్టర్ విజయ భాస్కర్ రెడ్డి, నంద్యాల ఐఎంఏ మహిళా విభాగం అధ్యక్షురాలు డాక్టర్ మాధవి, కార్యదర్శులు డాక్టర్ సునీత, డాక్టర్ లలిత, ఐఎంఏ నంద్యాల కార్యవర్గ సభ్యులు డాక్టర్ చిత్తలూరు మణిదీప్, జిల్లా క్షయ వ్యాధి నివారణ కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.

Scroll to Top