కబడ్డీ పోటీలను ప్రారంభించిన టీడీపీ యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్





సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 25 :
నంద్యాల జిల్లా పాణ్యం మండలం దుర్వేసి గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ హజరత్ దస్తగిరి స్వామి ఉరుసు మహోత్సవాలు బుధవారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ హాజరయ్యారు. గ్రామానికి చేరుకున్న ఫయాజ్ కు స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన దర్గాను దర్శించుకుని, ప్రత్యేక ప్రార్థనలు (పూజలు) నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా జరుపుకునే ఇటువంటి ఉత్సవాలు సమాజంలో సోదరభావాన్ని పెంపొందిస్తాయన్నారు. ఉరుసు ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన కబడ్డీ పోటీలను ఎన్ఎండి ఫయాజ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని, వారిని ఉత్సాహపరిచారు. క్రీడలు శారీరక ధారుడ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని, యువత క్రీడల్లో రాణించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి , హుస్సేన్ బాషా, రసూల్, శాలు బాషా, గౌండ హుస్సేన్, బాషా, మాజీ కౌన్సిలర్ కృపాకర్, కామిని మల్లికార్జున, బుగ్గరాముడు, స్థానిక టీడీపీ నాయకులు, ఉరుసు కమిటీ సభ్యులు, దాతలు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.
