అర్హులైన వైద్యులు మాత్రమే స్కానింగ్ సెంటర్లు నిర్వహించాలి –  డాక్టర్ వెంకటరమణ జిల్లా వైద్యఆరోగ్య శాఖ ఆధికారి

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / మార్చి 25 :

నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ఆదేశాల మేరకు డిస్టిక్ లెవెల్ మల్టీ మెంబర్ అప్పోపరేట్ అధారిటీ మీటింగ్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఆర్ వెంకట రమణ అధ్యక్షతన వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నందు పిసి మరియు పి ఎన్ డి టి సమావేశం నిర్వహించడం జరిగినది.

ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఆర్ వెంకటరమణ మాట్లాడుతూ లింగ నిర్ధారణ పరీక్షలు చట్ట రిత్య నేరమని అర్హులైన వైద్యులు మాత్రమే స్కానింగ్ కేంద్రాలు నిర్వహించాలని సమాజానికి ఆరోగ్యకరమైన బిడ్డ అవసరం అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి పర్మిషన్ లేకుండా స్కానింగ్ సెంటర్లు నిర్వహించిన, మగ బిడ్డ, ఆడబిడ్డ, అని స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు చెప్పిన చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నంద్యాల జిల్లాలోని అన్ని స్కానింగ్ సెంటర్ లపై స్టింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తామని కమిటీ మెంబర్ల అయినా వైద్యులను పంపించి తనిఖీలు చేయిస్తామని ఆ సమయంలో చట్టానికి వ్యతిరేకంగా ఎవరైనా లింగ నిర్ధారణ చేసినట్లయితే చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణ తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎస్పీ ఆదేశాలమేరకు స్పెసల్ బ్రాంచ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ యస్ సూర్య మౌళి, డిప్యూటీ డెమో ఎం పామన్న, మదర్స సొసైటీ అధ్యక్షులు రామారావు, మరియు వంశీ పాల్గొన్నారు.

Scroll to Top