






సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 30 :
నంద్యాల నియోజకవర్గం గోస్పాడు మండలం తేళ్లపురి గ్రామ పంచాయతీ పరిధిలో సోమవారం నాడు భారీ ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా విచ్చేసి పలు అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు కొత్త పనులకు భూమిపూజ చేశారు.
మంత్రి ఫరూక్ గ్రామంలో పూర్తయిన 9 రకాల అభివృద్ధి పనులను ప్రారంభించారు.
తేళ్లపురి కుందు నది నుండి దస్తగిరి స్వామి వరకు నూతనంగా నిర్మించిన సి.సి. రోడ్డు, జె.జె.ఎమ్ నిధుల కింద ఏర్పాటు చేసిన వాటర్ స్కీమ్, ఎస్.సి. కాలనీలలో సి.సి. రోడ్లు, డ్రైనేజీ కాలువలు మరియు స్మశాన వాటికకు రోడ్డు సౌకర్యం, గ్రామ సచివాలయం, అంగన్వాడీ స్కూళ్లు మరియు పాఠశాలల అభివృద్ధి పనులు…
నూతన పనులకు భూమిపూజ:
మంత్రి ఫరూక్ సుమారు 1.25 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థాన పునరుద్ధరణ (జీర్ణోద్ధారణ) పనులకు భూమిపూజ నిర్వహించారు. వీటితో పాటు ఆర్.ఓ. వాటర్ ప్లాంట్ మరియు మరికొన్ని సి.సి. రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన చేసిన అనంతరం మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ “రాష్ట్ర ప్రభుత్వం పల్లెల అభ్యున్నతికి పెద్దపీట వేస్తోందని . ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అన్నారు . తేళ్లపురి గ్రామ పంచాయతీలో నేడు సుమారు 9 అభివృద్ధి పనులను ప్రారంభించుకోవడం, మరిన్ని కొత్త పనులకు శ్రీకారం చుట్టడం సంతోషకరం.” అని తెలిపారు. “సుమారు 1.25 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థాన జీర్ణోద్ధారణ పనులు చేపట్టడం జరిగిందని . గ్రామాల్లో భక్తిభావం, ఆధ్యాత్మికత పెంపొందేలా ఆలయాల పునరుద్ధరణకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. గ్రామంలో సి.సి. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, మరియు సురక్షితమైన తాగునీటి కోసం వాటర్ ప్లాంట్ వంటి పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామన్నారు. ముఖ్యంగా పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధి ద్వారా భావి తరాలకు మెరుగైన విద్యను అందిస్తామన్నారు అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలని అధికారులను ఆదేశించడమైనదని . గ్రామ ప్రజలు కూడా అభివృద్ధి పనుల్లో భాగస్వాములై, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి. రాబోయే రోజుల్లో తేళ్లపురిని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామన్నారు
ఈ కార్యక్రమంలో తేళ్లపురి గ్రామ సర్పంచ్ కాటంరెడ్డి సుధామణి, కే.సి. కెనాల్ డి.సి. ఛైర్మన్ మరియు గోస్పాడు మండల టి.డి.పి. అధ్యక్షులు కాటంరెడ్డి తులసీశ్వర రెడ్డి , టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ , గ్రామ పెద్దలు, టీడీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది మరియు భారీ సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
